Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ ముందస్తు ఎన్నికలు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన జగన్.. ముందస్తు ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారని సమాచారం. గంటకు పైగా ప్రధానితో సమావేశం అయిన జగన్ తెలంగాణ సహా 5 రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు సమాచారం. ప్రధాని మోదీతో భేటీ ముగిసాక కేంద్ర హెంశాఖ మంత్రి అమిత్ షాతోనూ సమావేశమయ్యారు జగన్.
దాదాపు 45 నిముషాల పాటు జరిగిన ఆ సమావేశంలో కూడా అమిత్ షా ఎదుట ముందస్తు ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారని పలు కథనాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు అంటూ జాతీయ మీడియాలో ఇప్పటికే అనేక కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ వెనుక రహస్యం ఇదేనా అని రాజకీయ చర్చలు కూడా మొదలయ్యాయి. ఇంకా 3 రోజుల కిందట బీజేపీ ఎంపీ నోటా ఇదే మాట వచ్చింది. తనను సలహా అడిగితే ఏపీలో ముందస్తు పెట్టాలని చెప్తానని సదరు ఎంపీ తెలిపారు.
అయితే ముందస్తు ఎన్నికలపై వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలే అని వైసీపీ నేతలు అన్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఎంపీ మిధున్ రెడ్డి సైతం ముందస్తు ఎన్నికలపై సాగుతున్న ప్రచారాలను కొట్టిపారేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.