AP CM YS Jagan: వెంట్రుక కూడా పీకలేరు అన్న ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యల వెనుక వ్యూహం దాగి ఉందా?

|

Apr 09, 2022 | 10:53 AM

రేనాటిగడ్డలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రెచ్చిపోతున్నారు. ఆవేశపూరితమైన ప్రసంగం ఎందుకు చేస్తున్నారు.

AP CM YS Jagan: వెంట్రుక కూడా పీకలేరు అన్న ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యల వెనుక వ్యూహం దాగి ఉందా?
Cm Jagan
Follow us on

AP CM YS Jagan Mohan Reddy: రేనాటిగడ్డ(Renatigadda)లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎందుకు రెచ్చిపోతున్నారు. ఆవేశపూరితమైన ప్రసంగం ఎందుకు చేస్తున్నారు. రేనాటి గడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగల్ రెడ్డిల ప్రాంతమైన నంద్యాలలోనే వైఎస్ జగన్ పదే పదే ఆవేశపూరితమైన ప్రసంగం చేయడం వెనుక అంతర్యం ఏమిటి. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే క్యాడర్, లీడర్లో పౌరుషం నింపేందుకే నా అనే వాదన వినిపిస్తోంది. ఇంతకు జగన్ మనసులో ఏముంది.. ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.

విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రెడ్డి ,అపర దాన కర్ణుడు బుడ్డా వెంగల రెడ్డి ల ప్రాంతం నంద్యాల జిల్లా. ఉయ్యాలవాడ కోయిలకుంట్ల ఆవుకు బనగానపల్లె ఆళ్లగడ్డ తదితర ప్రాంతాలను రేనాటి గడ్డ అంటారు. ఈ ప్రాంతాలన్నీ పౌరుషానికి దాన ధర్మాలకు పెట్టింది పేరు. అందుకే నంద్యాలలో జగన్ ఆవేశపూరిత ప్రసంగాన్ని ముందుగానే ఎంచుకున్నారని తెలుస్తోంది.

అది ఉత్కంఠను కలిగించే సందర్భం నంద్యాల ఉప ఎన్నికలు. ప్రచారంలో భాగంగా నంద్యాల చారిత్రాత్మక ఎస్పీజీ గ్రౌండ్ లో జగన్ ప్రతిపక్ష నేతగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ నుంచి జగన్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబును కాల్చి చంపిన పరవాలేదు అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు అత్యంత సంచలన మయ్యాయి అప్పట్లో….

అదే నంద్యాల. అదే ఎస్పీజీ గ్రౌండ్. అదే బహిరంగ సభ. కాకపోతే నాడు ప్రతిపక్ష నేత నేడు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష నేతగా నంద్యాలను జిల్లా చేస్తానని అదే బహిరంగ సభలో హామీ ఇచ్చారు. తిరిగి ముఖ్యమంత్రిగా అదే గ్రౌండ్ లో సీఎంగా నంద్యాలను జిల్లా చేశానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ని చెప్పుకొచ్చాడు. అంతవరకు బాగుంది కానీ చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు ఎల్లో మీడియా పై ఆవేశంగా విరుచుకు పడటం, వెంట్రుక కూడా పీకలేరు అనడం పట్ల జగన్ లో వ్యూహం దాగి ఉంది అనే చర్చ జరుగుతోంది. తన ఆవేశపూరిత ప్రసంగం ద్వారా రేనాటి గడ్డ నంద్యాల జిల్లాలో క్యాడర్ లీడర్ లలో పౌరుషం నింపటం జగన్ ప్లాన్ లో భాగం అని చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేత గా ముఖ్యమంత్రిగా ఇదే గ్రౌండ్లో ఇదే నంద్యాలలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పట్ల జగన్ పొగడ్తలు కూడా ఇందులో భాగమే అనే వాదన వినిపిస్తోంది.

మొత్తానికి, దీన్ని బట్టి చూస్తే శిల్పా చక్రపాణి రెడ్డి కి మంత్రి పదవి యోగం దాదాపు వచ్చినట్లే అనే భావన రేనాటి గడ్డ లో వినిపిస్తోంది.. ఎంతైనా నంద్యాల జిల్లాలో జగన్ వ్యూహాత్మక ప్రసంగం పార్టీకి ఒకింత బూస్ట్ ఇచ్చేలా ఉందని చర్చ కూడా నడుస్తోంది..

మరోవైపు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా 2009 లో తెలంగాణ లో మొదటి విడత ఎన్నికలు పూర్తవగానే రాయలసీమలో ముఖ్యంగా నంద్యాల లోనే బహిరంగ సభ నిర్వహించారు.. తెలంగాణ వెళ్లాలంటే పాస్‌పోర్టు కావాలా..? వీసా కావాలా..? అలా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరికీ గుర్తుకు వచ్చేసింది. రాజశేఖర్ రెడ్డి లోనూ జగన్ లోనూ ఒకటే వ్యూహం ఉన్నట్టుగా స్పష్టమవుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

— నాగిరెడ్డి, టీవీ 9, ప్రతినిధి, కర్నూలు జిల్లా.

Read Also… Telangana: మరోసారి వాయింపు.. టికెట్‌ ఛార్జీలు పెంచిన TSRTC.. నేటి నుంచే అమల్లోకి