
ప్రతి ఆదివారం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసారెడ్డి పట్టణంలో గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పారిశుద్యం, ప్రజల సమస్యలు, త్రాగునీరు పంపిణి వంటి అంశాలపై నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆయన స్టేషన్ రోడ్డులో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వాహానం ఢీకొని తీవ్రంగా గాయపడిన ఆవు కనిపించింది. రక్తం మడుగులో ఉన్న ఆవును చూసి ఆయన చలించిపోయారు. వైద్యుడు కావడంతో వెంటనే చికిత్స అందించారు. కట్టు కట్టించారు. అదే సమయంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా ఆ మార్గంలో ప్రయాణిస్తున్నారు. స్థానికులు గుమికూడటాన్ని చూసి ఆయన కూడా ఆవు దగ్గరకు వచ్చారు. అప్పటికే మాజీ ఎమ్మెల్యే అక్కడే ఉన్నా అరవింద్ బాబు కూడా సిబ్బందికి తగు సూచలను చేశారు. వెంటనే ఆవును వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. వాళ్లద్దరూ ఒకే చోట చేరడంపై స్థానికులు చర్చించుకున్నారు.
అయితే ఇద్దరూ పక్కపక్కనే ఉన్నా కనీసం విష్ కూడా చేసుకోకపోవడం ఒకరంటే మరొకరికి తెలియదనట్లు ప్రవర్థించడంపై మాత్రం పట్టణ వాసులు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే రాజకీయ ప్రత్యర్ధులను మాత్రం ఆవు కలిపిందంటూ సెటైర్లు వేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.