Andhra Pradesh: సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కార్‌.. ఈ నెల నుంచే జీతాల పెంపు..

|

Jul 26, 2022 | 8:04 AM

Andhra Pradesh: సచివాలయ ఉద్యోగులకు జీతాలను పెంచడంతో పాటు జాబ్‌ పర్మిట్ చేసిన ఏపీ ప్రభుత్వం పెంచిన జీతాలను ఈ నెల నుంచే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు..

Andhra Pradesh: సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కార్‌.. ఈ నెల నుంచే జీతాల పెంపు..
Follow us on

Andhra Pradesh: సచివాలయ ఉద్యోగులకు జీతాలను పెంచడంతో పాటు జాబ్‌ పర్మిట్ చేసిన ఏపీ ప్రభుత్వం పెంచిన జీతాలను ఈ నెల నుంచే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇటీవలే ప్రొబేషన్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వీరికి పే స్కేల్‌తో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్స్‌లు కలిపిన వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖలో కొత్తగా వివిధ ఖాతా (హెడ్‌)ల ఏర్పాటుతో పాటు అదనపు బడ్జెట్‌ కేటాయింపులు చేసింది.

గ్రామ సచివాలయాల ఉద్యోగుల వేతనాల కోసం కేటాయించిన రూ.768.60 కోట్ల అదనపు నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 1,995 కోట్లు విడుదల చేయగా, తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ. 2,763.60 కోట్లు విడుదల చేశారు. జీతాలు పెంచడంపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.

ప్రొబేషన్‌ పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందుతాయని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు సోమవారం తెలిపారు. వార్డు సచివాలయాల ఉద్యోగులకు పెరిగిన జీతాల జీవో కూడా వేరుగా విడుదలవుతుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..