Andhra Pradesh: పెనుగంచిప్రోలులో అమానుషం.. డబ్బిస్తేనే తండ్రికి తలకొరివి పెడతాన్న కుమారుడు.. చివరకు..

|

Feb 04, 2023 | 11:14 AM

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో అమానుష ఘటన చోటు చేసుకుంది. జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తండ్రికి తలకొరివి పెట్టడానికి డబ్బు డిమాండ్ చేశాడు కుమారుడు. పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రులో..

Andhra Pradesh: పెనుగంచిప్రోలులో అమానుషం.. డబ్బిస్తేనే తండ్రికి తలకొరివి పెడతాన్న కుమారుడు.. చివరకు..
Ntr Krishna District
Follow us on

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో అమానుష ఘటన చోటు చేసుకుంది. జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తండ్రికి తలకొరివి పెట్టడానికి డబ్బు డిమాండ్ చేశాడు కుమారుడు. పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రులో వెలుగు చూసింది ఈ దారుణం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనిగండ్లపాడుకు చెందిన గింజుపల్లి కోటయ్య శుక్రవారం నాడు అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే, తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఖర్మ చేసేందుకు తనయుడు రామారావు నిరాకరించాడు. ఆస్తి విషయంలో తరచూ తల్లిదండ్రులతో విగ్వాదానికి దిగేవాడు. దాంతో గుమ్మడిదుర్రులోనే ఆరేళ్లుగా కూతురు వద్దే తలదాచుకుంటున్నారు వృద్ధ దంపతులు. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా భీష్మించి కూర్చున్నాడు కొడుకు. గతంలో కోటయ్య ఆస్తిని విక్రయించగా వచ్చిన డబ్బులు ఇస్తేనే అంత్యక్రియలు చేస్తానని మొండికేశాడు. ఇక చేసేదేమీ లేక.. గుమ్మడిదుర్రులో కుమార్తె విజయలక్ష్మి తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. డబ్బు కోసం కన్నతండ్రికి తలకొరివిపెట్టని వ్యక్తిపై దుమ్మెత్తిపోస్తున్నారు జనాలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..