ఉత్తరతమిళనాడు-దక్షిణకోస్తా తీరాలకు ఆనుకుని నైరుతి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం(మే 24) ఉదయానికి మధ్యబంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
దీని ప్రభావంతో గురువారం (మే 23) పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం (మే 24) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారా మ రాజు, ఏలూరు, కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది.
రేపు శ్రీకాకుళం 9, విజయనగరం 5 , పార్వతీపురంమన్యం 11, అల్లూరిసీతరామరాజు కూనవరం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 40.6°C, నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 40.3°C, ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు, నెల్లూరు జిల్లా రాపూరులో 40.2°C, విజయనగరం శృంగవరపుకోటలో 39.9°C, శ్రీకాకుళం జిల్లా గంగువారిసగడాం, వైయస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల, ఖాజీపేటలో 39.8°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.