ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ IAS నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ మేరకు ఆయన్ను సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు సీఎస్‌గా ఉన్న కె.ఎస్.జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లగా.. కొత్త సీఎస్ నియామకం జరిగింది. నూతన సీఎస్ నియమాకం జరిగినందున జవహర్‌రెడ్డిని బదిలీ చేశారు. బుధవారం ఉదయం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు.
Amaravati, Andhra Pradesh: IAS Neerabh Kumar Prasad has been appointed the new Chief Secretary to the government of Andhra Pradesh. pic.twitter.com/JlsBH00rt0
— ANI (@ANI) June 7, 2024
ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ముందు కీలక మార్పులు జరుగుతున్నాయి. CMOలో కొత్త టీమ్‌పై కసరత్తు కొనసాగుతోంది. సీఎం ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రకు ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ఆర్థికశాఖలో పనిచేశారు. సాయిప్రసాద్‌ను కూడా CMOలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ప్రమాణస్వీకారానికి ముందే నియామకాలు పూర్తి కానున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..