Andhra Pradesh: పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మింది ఆ మహిళ.. భర్త మరణానంతరం కూడా ఆయనను పూజిస్తూ ఆయన సేవకే అంకితమైంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే, ఆయన మరణాన్ని అతని భార్య జీర్ణించుకోలేకపోయింది. భర్తపై అపారమైన ప్రేమ ఉండటంతో.. ఆయన ఎడబాటును తట్టుకోలేకపోయింది. దైవ సమానుడిగా భర్తను ఆరాధించిన ఆ భార్య.. ఆయనకోసం ఏకంగా ఒక గుడినే కట్టింది. తన భర్త మరణానంతరం ఆయనకు ఒక గుడి కట్టి.. అందులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అతని విగ్రహానికి నిత్యం పూజలు చేస్తోంది. అంతేకాదు.. అంతేకాదు ప్రతి పౌర్ణమి, శని, ఆదివారాలలో పేదలకు అన్నదానం కూడా చేస్తూ ఆదర్శ భార్యగా నిలుస్తోంది.
ప్రకాశంజిల్లా పొదిలికి చెందిన గురుగుల అంకిరెడ్డి, పద్మావతికి పదకొండేళ్ల క్రితం వివాహమైంది. అయితే నాలుగు సంవత్సరాల క్రితం అంకిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భార్య వెంకట పద్మావతి భర్తపై ప్రేమ, అభిమానంతో నిమ్మవరం గ్రామంలో గుడికట్టింది. భర్త విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తూ భర్త సేవకే అంకితమైంది. ప్రతి ఏటా గురుపౌర్ణమికి ఆయన పేరుమీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకుంది. భర్త మరణానంతరం కూడా పద్మావతి పతియే ప్రత్యక్ష దైవం అంటూ ఆయన పాద సేవకే అంకితం కావడంపై పలువురు ఆమెను అభినందిస్తున్నారు. పద్మావతిని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also read:
Hyderabad City: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. చదువు నేర్పుతారని పిల్లలను పంపిస్తే..
Telangana Collectors: తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు.. హైదరాబాద్ కలెక్టర్‌గా ఎల్. శర్మన్..