Andhra Pradesh: కచ్చిడి చిక్కింది.. సిరులు తెచ్చింది.. ఎంత పలికిందో తెలిస్తే షాకే

మత్స్యకారుల వలకు భారీ కచ్చిడి చేప చిక్కింది. దీనిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. ఆడ, మగ చేపల్లో.. ఈ రకం మగ చేపకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ చేప ప్రత్యేకతలు తెలుసుకుందా పదండి..

Andhra Pradesh: కచ్చిడి చిక్కింది.. సిరులు తెచ్చింది.. ఎంత పలికిందో తెలిస్తే షాకే
Kachidi Fish

Updated on: Mar 24, 2022 | 2:15 PM

East Godavari District: ఈ మధ్య కచ్చిడి చేప పేరు జనాల నోళ్లలో బాగా నానుతుంది. అందుకు కారణం దాని రేటు. ఈ రకం చేప జాలర్లకు మంచి సుడి ఉన్న రోజు చిక్కుతుంది. ధర అయితే  ఓ రేంజ్‌లో పలుకుతుంది.  మగ చేప అయితేనే మార్కెట్‌లో పీక్స్‌లో డిమాండ్ ఉంటుంది. దీన్ని కొనేందకు వ్యాపారులు పోటీ పడతారు.  ఈ చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని.. అందుకే అంత రేటని వ్యాపారాలు చెబుతారు. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. ఖరీదైన వైన్‌ తయారీలోనూ ఈ ఫిష్‌‌ను వినియోగిస్తుంటడంతో డిమాండ్ ఇంకా పెరిగింది. దీనిని గోల్డెన్ ఫిష్(Golden Fish) అని కూడా పిలుస్తారు. నిజంగానే ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు గోల్డ్ దొరికనట్టే అని భావిస్తారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద ఇరవై ఎనిమిది కేజీల మగ చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ చేపను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గ్రామానికి చెందిన వ్యాపారి 2,90,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. ఈ మగ చేప పొట్టబాగంలో ఔషధ గుణాలు విరివిగా కలిగి ఉండటంతో మార్కెట్లు దీనికి విలువ ఎక్కువ ఉంటుందని మత్స్యకారులు తెలుపుతున్నారు. కాగా ఈ చేప ఎక్కడా ఓ ప్రాంతంలో నిలకడగా ఉండదు. ఒక చోట నుంచి మరో చోటికి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది. అందుకే వలకు చిక్కడం అరుదు.

 

Also Read: ఎండు మిర్చి మాత్రమే కాదు.. పచ్చి మిర్చి కూడా దుమ్ములేపుతుంది.. కేజీ ఎంతో తెలుసా..?

విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్​లో ‘ఆర్​ఆర్​ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్