
విశాఖ పారిపారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హెచ్ పీ సి ఎల్ రిఫైనరీకి చెందిన చిమ్ని నుంచి సాధారణంగా నిత్యం మంట వస్తూ ఉంటుంది. చమురు శుద్ధి కేంద్రాల్లో.. చిమ్ని నుంచి మంటలు రావడం అనేది సహజం. వ్యర్థ పదార్థాలన్నీ ఇలా మండిపోతు ధ్వంసం అవుతూ ఉంటాయి. దానివల్ల సంస్థకు గాని జనాలు కానీ ఎటువంటి నష్టం ఉండదు. అది సంస్థ కార్యకలాపాల్లో ఒక భాగం. విశాఖలోనూ హెచ్పీసీఎల్ చిమ్ని నుంచి నిత్యం మంటలు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయం. కానీ.. ఆ మంటలు కాస్త పెరిగాయి. అది కాస్తా ఆ నోటా ఈ నోటా పాకింది. పరిసర ప్రజలంతా ఆందోళన చెందారు. ఈ లోగా సోషల్ మీడియాలో వీడియోలు, మెసేజ్ వైరల్ అయింది.
ఒకవైపు తుపాను హడావుడిలో ఉన్న విశాఖ ప్రజలకు మరోసారి గుండెలు పట్టుకునే పరిస్థితి ఎదురైంది. ఏదైనా ప్రమాదం జరిగిందా అని కంగారు పడిన వాళ్ళూ లేకపోలేదు. ఈ లోగా వారందరికి మరో మెసేజ్ వచ్చింది. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రమాదమేమీ లేదని తెలిసింది. దీంతో వారందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
అసలు విషయానికి వస్తే.. గత మూడు రోజులుగా వాతావరణం బాగా చల్లబడింది.. ఆ తర్వాత ఒక్కసారిగా చిమ్నీని మండించడంతో ఇలా భారీగా మంట కనిపించిందని సంస్థ కార్మికుల చెబుతున్నారు. చిమ్నీ అంతర్గతంగా ఉండే కర్బన ఉద్గారాలను మండించడం ఉత్పత్తి ప్రక్రియలో భాగమేనని.. ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. దంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనిపై యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియా ప్రభావమే ఇంత పని చేసిందని విశాఖలో జనం చర్చ మొదలైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.