
ఒంగోలు శివారులో గాడిద మాంసం పేరుతో గుర్రాలను కోసి అమ్ముతున్న ఏడుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రయించడానికి సిద్దం చేసిన గుర్రం మాంసం స్వాధీనం చేసుకున్నారు. గాడిద మాంసం పేరుతో గుర్రాలను కోసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. మార్కెట్లో గాడిద మాంసానికి డిమాండ్ ఉండడంతో గుర్రాలను కోసి గాడిద మాంసం పేరుతో సొమ్ము చేసుకుంటున్నారని గుర్తించారు.
ఒంగోలు నగరం శివారులోని మంగమూరు రోడ్డు దత్త గణపతి నగర్ దగ్గర గాడిద మాంసం పేరుతో క్రాస్ బ్రీడ్ గుర్రాలను కోసి మాంసం విక్రయిస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు అర్ధరాత్రి రైడ్ చేశారు. వీరు బాపట్ల జిల్లా చెరుకుపల్లి నుంచి గుర్రాలను తీసుకుని వచ్చి ఇక్కడ వాటిని గాడిదల పేరుతో కోసి మాంసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని గుర్తించారు. గాడిద మాంసానికి ఇటీవల ఎక్కువగా డిమాండ్ ఉండటంతో పాటు ధర ఎక్కువ పలకడంతో గుర్రం మాంసాన్ని గాడిద మాంసం పేరుతో విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
గాడిద పాలకే కాదు.. మాంసానికీ పెరిగిన డిమాండ్…
గాడిద పాలల్లో ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు. ఉబ్బసం వ్యాధితో బాధపడేవారు గాడిద పాలు తాగితే ఉపశమనం కలుతుతుందనే నమ్మకాలు ఉన్నాయి. ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా గాడిద పాలకు మాత్రం పెద్ద డిమాండే ఉంది… గాడిద పాలతో పాటు ఇటీవల వీటి మాంసానికి కూడా డిమాండ్ పెరిగింది… ఈ నేపధ్యంలో గాడిదలతో నాసిరకం గుర్రాలను క్రాస్ బ్రీడ్ చేసి పుట్టించిన గుర్రాలను కోసి దాన్ని గాడిద మాంసంగా చెబుతూ అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్న ముఠాలు ఇటీవల ఎక్కువయ్యాయి… అందులో భాగంగా ఒంగోలు శివారులో క్రాస్‌బ్రీడ్ గుర్రాలను కోసి గాడిద మాంసం పేరుతో విక్రయిస్తున్నారు… వీరి గురించి సమాచారం అందుకున్న ఒంగోలు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు… ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వీటి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ చౌడయ్య తెలిపారు. కాగా ఈ మాసం కేజీ 1000 రూపాయలకు కూడా అమ్ముకున్నట్లు తెలిపారు.
Also Read: అడవి కోడితో ఆషామాషీ కాదు.. దాని ప్రత్యేకతలు మీకు తెలుసా..?