Big Breaking: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే

|

Apr 06, 2021 | 4:50 PM

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఏ పీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది.

Big Breaking: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే
The AP High Court
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 15న ఎస్‌ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు కావాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని ఏపీ హైకోర్టు పేర్కొంది. ఈ నెల 1న ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌లో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. నూతన ఎస్‌ఈసీ నీలం సాహ్నీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన వేసిన పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

ఎస్‌ఈసీ షెడ్యూల్ ఇలా ఉంది….

రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌‌ను ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 1 న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తామని నొటిఫికేషన్‌లో తెలిపారు. ఈ నెల 10న పరిషత్‌ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ నీలం సాహ్ని.. వరుస భేటీలతో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. రెండో రోజు రాజకీయ పార్టీలతో మీటింగ్‌ పెట్టారు. ఆ తర్వాతే ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఉత్తర్వుుల జారీ చేశారు. తాజాగా కోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది.

 

మరోవైపు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయొద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీలోని పలువురు నేతలు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ నేతలు అశోక్ గజపతి రాజు, జ్యోతుల నెహ్రూ తన అసంతృప్తిని ఇప్పటికే ప్రకటించారు.  కాగా బహిష్కరణ నిర్ణయానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కోరారు.  పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే అధినేత ఎన్నికలను బహిష్కరిస్తున్నారన్న విషయాన్ని గుమనించాలన్నారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక నిజాయితీగా జరిగితే తెలుగుదేశం విజయఢంకా మోగిస్తుందన్నారు.

Read more at: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-high-court-on-state-parishat-elections-290903.html?story=2

Also Read: “రైతుల వెన్నంటే కేసీఆర్”.. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న సీఎం అద్భుత చిత్రం వీడియో