Chandrababu Arrest: రాజమండ్రి జైల్లో ఇదే తొలిసారి.. చంద్రబాబు విచారణ.. కండీషన్స్ అప్లై..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును విచారించేందుకు అనుమతించిన కోర్ట్.. కొన్ని కండీషన్లు పెట్టింది. చంద్రబాబు ఆరోగ్యం, వయసును దృష్టిలో పెట్టుకుని.. ఆ షరతులు పెట్టింది. ఆ షరతులేంటి? ఎంతమందికి సిబ్బందికి అనుమతించారు?

Chandrababu Arrest: రాజమండ్రి జైల్లో ఇదే తొలిసారి.. చంద్రబాబు విచారణ.. కండీషన్స్ అప్లై..
Chandrababu Naidu Arrest

Updated on: Sep 23, 2023 | 7:37 AM

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ.. కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి చంద్రబాబేననీ.. ఆయనని పూర్తిస్థాయిలో విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని కోర్టులో వాదించింది. 5 రోజుల పాటు కస్టడీ కావాలని సీఐడీ కోరింది. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న కోర్ట్.. తీర్పు ఇచ్చే విషయంలో కొంచెం సమయం తీసుకుంది. చివరకు 2 రోజులు మాత్రమే కస్టడీకి అనుమతించింది. అది కూడా కండీషన్స్ అప్లై అంటూ.. కొన్ని షరతులు పెట్టింది ఏసీబీ కోర్ట్.

చంద్రబాబు ఆరోగ్యం, భద్రత దృష్ట్యా జర్నీ అవసరం లేకుండా జైల్లోనే విచారించాలని కోర్ట్ ఆదేశించింది. ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించే అవకాశం కల్పించింది. విచారణలో మొత్తం 12 మందిని జైల్లోకి అనుమతించాలి. 9 మంది అధికారులతో పాటు ఒక వీడియో గ్రాఫర్ ఇద్దరు మీడియేటర్లను అనుమతిస్తారు. ఏడుగురు న్యాయవాదులు విచారణ జరిగే ప్రాంగణంలో ఉండవచ్చనేది కోర్ట్ ఆదేశం. కస్టడీకి తీసుకునే ముందు బాబుకు వైద్య పరీక్షలు చేయాలి. విచారణ సందర్భంగా పోలీసులు ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు.

న్యాయవాది సమక్షంలో చంద్రబాబును విచారించాలి.. అయితే విచారణలో న్యాయవాదులు జోక్యం చేసుకోకూడదు. విచారణ సందర్భంగా చంద్రబాబుకు అవసరమైన మెడికల్ సదుపాయం కల్పించాలి. మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు లంచ్ విరామం ఉంటుంది.

ప్రతి గంటలో ఐదు నిమిషాల పాటు బ్రేక్ ఇచ్చింది. విచారణ సమయంలో చంద్రబాబు తరపున ఇద్దరు లాయర్లు ఉంటారు. బ్రేక్ సమయంలో చంద్రబాబు తన కౌన్సిల్‌తో మాట్లాడే వెసులుబాటు కల్పించింది. న్యాయవాదికి కనిపించేలా చంద్రబాబును విచారించాలి.. విచారణ మొత్తం వీడియోగ్రఫీ చేయాలనేది కోర్ట్ ఆదేశం. అంతే కాకుండా దర్యాప్తుపై పూర్తి గోప్యత పాటించాలనీ.. సీల్డ్ కవర్లో కాపీని కోర్ట్‌కు సమర్పించాలని ఆదేశించింది.

సీఐడీ డీఎస్పీ ధనంజయుడు నేతృత్వంలో ఒక సీఐ, ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్ల సమక్షంలో ఈ విచారణ జరగనుంది. రాజమండ్రి జైల్లో మాజీ సీఎం స్థాయి వ్యక్తిని విచారించడం ఇదే తొలిసారి కావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us