తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

| Edited By:

Sep 13, 2020 | 11:45 AM

ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Follow us on

ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనివల్ల ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

దక్షిణ కోస్తా మీదుగా తూర్పు, పడమరవైపు ద్రోణి కొనసాగుతుంది. దీంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఈ ద్రోణి వల్ల రాయలసీమ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో చేపల వేటకు వెళ్తే, బోట్లు తిరగబడే ప్రమాదం ఉంటుందని, పైగా అల్పపీడనం నుంచే వాయుగుండం, తుఫాను మారే అవకాశం వుంది. దీంతో జాలర్లు రెండ్రోజులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఇక సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయన్నాయి.

ఆది, సోమ‌వారాల్లో హైదరాబాద్‌ తోపాటు ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ,భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.