AP Weather: ఏపీకి హై అలెర్ట్.. 3 రోజులు దంచి కొట్టనున్న వర్షం

ఉపరితల ఆవర్తనం ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం....

AP Weather: ఏపీకి హై అలెర్ట్.. 3 రోజులు దంచి కొట్టనున్న వర్షం
Andhra Weather Report

Updated on: Oct 06, 2024 | 4:50 PM

ఆదివారం నాటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో నున్న ఉపరితల ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతం మరియు సరిహద్దు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ & ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ నుండి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశకు వంగి ఉంది. ఉపరితల ద్రోణి ఒకటి ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకు ఉత్తర కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక ద్వారా సగటు సముద్ర మట్టానికి ౦.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించియున్నది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది

మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .
ఎల్లుండి :-

మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ :-

ఆదివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది

మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us