ఆంధ్రపదేశ్‌కు వర్ష సూచన చేసింది వెదర్ డిపార్ట్‌మెంట్. రాబోయే 3 రోజులు దండిగా వానలు పడతాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మాదిరి వానలు పడతాయని తెలిపింది. ఇక సోమ, మంగళవారాల్లో మాత్రం.. కుండపోత వర్షాలు ఉంటాయని తెలిపింది.
ఈ నెల 3న అంటే సోమవారం.. కోనసీమతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది. ఇక పల్నాడు, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో చెదురు మదురు జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. ఇక 4వ తేదీ అంటే మంగళవారం.. ప్రకాశం, నెల్లూరు, , బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వరుణ బీభత్సం ఉంటుందని తెలిపింది. అదే రోజు ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
భారీ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ట్వీట్ చేసింది. రైతులు, రైతు కూలీలు.. గొర్రెల కాపర్లు పొలాల్లో ఉంటే.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని.. చెట్ల కిందకు అస్సలు వెళ్లవద్దని పేర్కొంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..