AP Weather: ఏపీకి అల్పపీడనం ముప్పు.. వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక

|

Oct 13, 2024 | 4:54 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దక్షిణకోస్తా, ఉత్తరాంధ్ర,రాయలసీమ జిల్లా ప్రాంతాలలో వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

AP Weather: ఏపీకి అల్పపీడనం ముప్పు.. వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక
Andhra Weather Report
Follow us on

గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అస్సాం, మేఘాలయలోని మిగిలిన ప్రాంతాల నుంచి.. మొత్తం అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర & మహారాష్ట్రలోని మరికొన్ని భాగాలు, ఉత్తర బంగాళాఖాతంలో తదుపరి 2 రోజులలో నైరుతి రుతుపవనాలు మరింత ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు మారుతున్నాయి.  ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు తరువాతి 2 రోజుల్లో దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అదే సమయంలో దక్షిణ భారతదేశ ద్వీపకల్ప మీదుగా తూర్పు & ఈశాన్య గాలులు ఏర్పడతాయి. ద్వీపకల్ప భారతదేశం, దక్షిణ & ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం, అదే సమయంలో ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల వర్షపాత కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

శనివారం.. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర అంతర్గత తమిళనాడుపై విస్తరించి సముద్ర మట్టంనకు 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి వైపుకు వంగి ఉంది.  ఉపరితల ద్రోణి తూర్పు మధ్య & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య అరేబియా సముద్రం మీదునున్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతమునుండి దక్షిణ కేరళ మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ & 5.8 కిమీల మధ్య తమిళనాడు మీదుగా నున్న ఉపరితల ఆవర్తనం వరకు అనుసంధానించబడింది .

మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతం & ఆనుకుని ఉన్న భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి 13 అక్టోబర్ 2024 ,ఉదయము 8 .30 గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో, అక్టోబరు 14 నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 48 గంటల్లో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా మారి పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. ఈ క్రమంలో.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

 

ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

సోమవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

సోమవారం:-  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది

మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది

రాయలసీమ :-

ఆదివారం :-  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

సోమవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.  భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది

మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..