Half Day Schools: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటి పూట బడులపై కీలక అప్‌డేట్

ఏపీలో హాఫ్ డే స్కూల్స్ నిర్ణీత సమయం కంటే ముందే ప్రారంభం కానున్నాయా? మండే ఎండలకు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందా? అనే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. మండుతున్న ఎండల నేపథ్యంలో.. ప్రభుత్వం ఇదే విషయంపై ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Half Day Schools: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటి పూట బడులపై కీలక అప్‌డేట్
Students

Updated on: Feb 23, 2025 | 10:50 AM

ఏపీలో ఈసారి ఒంటి పూటలు బడులు కాస్త ముందుగా ప్రారంభమయ్యే అవకాశం ఉందా అంటే.. అవుననే సంకేతాలను కనిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి కూడా రాకుండానే ఎండలు దంచికొడుతున్నాయి. మిడ్ సమ్మర్‌ని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 దాటితో చాలు సూర్యుడు యాక్షన్‌లోకి దిగుతున్నాడు. దీంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీంతో ఒంటి పూట బడుల ప్రస్తావన వచ్చింది. అధికారులు కూడా ఈ అంశాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయినా ప్రతి ఏటా మార్చి 15 నుంచి 20 మధ్యన ఒంటి బడులు ప్రారంభం చేస్తారు. అయితే ఎండల దృష్ట్యా గత ఏడాది ముందుగానే హాఫ్ డే స్కూల్స్ ప్రారంభించారు. ఈ ఏడాది కూడా అలానే ముందుగా స్టార్ట్ చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రలు కోరుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటన చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి మొదటి వారం అనంతరం.. మార్చి 10వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అనధికారికంగా తెలిసింది.

వాతావరణ శాఖ అధికారులు సైతం..  రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు.  ఎండల ధాటికి వడదెబ్బ, డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పిల్లల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక స్కూళ్లలో కూడా వేసవి నేపథ్యంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి