Podili Rathotsavam: దక్షిణకాశీలో వైభవంగా రథోత్సవం.. కులమతాలకు అతీతంగా పాల్గొన్న భక్తులు!

ప్రకాశం జిల్లా పొదిలిలో శ్రీ నిర్మమహేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో విజయనగర సామ్రాజ్యం నాటి నుండి ఈ వేడుక కొనసాగుతోంది. కులమతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. శతాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయంలో వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని, హరహర మహాదేవ నామస్మరణతో రథాన్ని లాగి ఐక్యతను చాటారు.

Podili Rathotsavam: దక్షిణకాశీలో వైభవంగా రథోత్సవం.. కులమతాలకు అతీతంగా పాల్గొన్న భక్తులు!
Podili Rathotsavam

Edited By:

Updated on: Feb 16, 2026 | 8:25 PM

ప్రకాశంజిల్లా పొదిలిలో శ్రీ నిర్మమహేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. దక్షిణ కాశీగా పేరుందిన పొదిలి శ్రీ నిర్మ మహేశ్వర స్వామి రధోత్సవం విజయనగర సామ్రాజ్య కాలం నాటి నుంచి ఇప్పటివరకు కొనసాగుతోంది. ఈ రధోత్సవంలో పొదిలి పట్టణంలోని హిందువులు, ముస్లింలు కులమతాలకు అతీతంగా పాల్గొన్నారు. పొదిలిలో ఎక్కువగా ఉండే ముస్లింలు శివరాత్రి సందర్భంగా శతాబ్దాలుగా నిర్మమహేశ్వరస్వామి ఆలయంలో స్వామిని దర్శించుకోవడం, ఆ తరువాతిరోజు జరిగే రథోత్సవంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది.

పృధులగిరిగా పేరొందిన పొదిలిలోని నిర్మమహేశ్వరస్వామి రథోత్సవానికి పొదిలి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పొదిలి పట్టణంలోని పురవీధులు శివయ్య నామస్మరణతో మారుమోగాయి. పొదిలిలోని శివాలయం నుండి చిన్న బస్టాండ్, పెద్ద బస్టాండ్, రాఘవేంద్ర సినిమా హాల్ మీదుగా శివాలయం వరకు శ్రీ నిర్మా మహేశ్వర స్వామిని రధంలో భక్తులు తాడులాగుతూ ఊరేగించారు

అయితే రథోత్సవాన్ని చూసేందుకు తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదానాలు, మజ్జిగ, సీతల పానీయాలు అందించారు. కులమతాలకు అతీతంగా హరహర మహాదేవ శంభో శంకర అంటూ రథాన్ని లాగుతూ భక్తులు తమ కోరికలు తీర్చమని స్వామిని మొక్కుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us