
మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ సబ్బితి శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులమంటూ బురిడీ కొట్టించాడు సైబర్ నేరగాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బ్లాక్ మెయిల్ చేసి రెండు లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు నూతేటి జయకృష్ణ, అతనికి సహకరిచిన మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 85 వేల నగదు, 9 సెల్‌ఫోన్లతో పాటు ఒక బైకును రికవరీ చేశారు పోలీసులు. గత నెల నవంబర్ 13న మొగల్తూరు సబ్ రిజిస్టర్ సబ్బితి శ్రీనివాస్‌కు ఫోన్ చేసాడు నిందితుడు నూతేటి జయకృష్ణ. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఫిర్యాదులు అందాయి. మీ కార్యాలయం పై దాడి చేయకుండా ఉండాలంటే రూ . 3 లక్షలు నగదు ముట్ట చెప్పాలని నిందితుడు ఫోన్ చేసాడు . దీనితో భయపడిన సబ్ రిజిస్టార్ శ్రీనివాస్ ఫోన్ తన నుండి, అతని మిత్రుల ఫోన్ నుండి ఫోన్ పే ద్వారా రెండు లక్షలు సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేశారు.
అయితే నిందితుడు జయకృష్ణ మరో లక్ష రూపాయలు కూడా వేయాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన సబ్ రిజిస్టర్ విజయవాడ ఏసీబీ అధికారులకు ఫోన్ చేయగా వారు తాము అటువంటి ఫోన్స్ చేయమంటూ సమాధానం ఇచ్చారు. దింతో మోసపోయానని గ్రహించిన సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ మొగల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు . కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు ఉపయోగించిన ఎకౌంటు ద్వారా నిందితుల ఆచూకీ తెలుసుకొని వారిని అరెస్టు చేశారు . నిందితుడు జయకృష్ణ పై రాష్ట్రంలో 30 కేసులు పైగా ఉన్నాయి . ఇతను ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులను టార్గెట్ చేసి వారికి ఏసీబీ అధికారులమంటూ ఫోన్ చేసి డబ్బులు అకౌంట్లలో వేయించుకుంటాడన్నాడని నరసాపురం రూరల్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు . ఇతనికి సహకరించిన ఒకే కుటుంబానికి చెందిన తండ్రి , కూతురు , మనవడు వడ్డీ రామాంజనేయులు, వనిత, తరుణ్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరుచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.