రైల్వే ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్.. 3 గంటలు ఆలస్యంగా వందే‌భారత్, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు..

రైల్వే ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్. మరీ ముఖ్యంగా విజయవాడ, హైదరాబాద్ వెళ్లే రైల్వే పాసింజర్లకు ముఖ్య గమనిక. బుధవారం తెల్లవారుజామున 3.35 గంటలకు తాడి-అనకాపల్లి మార్గంలో..

రైల్వే ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్.. 3 గంటలు ఆలస్యంగా వందే‌భారత్, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు..
Railways

Updated on: Jun 14, 2023 | 9:23 AM

రైల్వే ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్. మరీ ముఖ్యంగా విజయవాడ, హైదరాబాద్ వెళ్లే రైల్వే పాసింజర్లకు ముఖ్య గమనిక. బుధవారం తెల్లవారుజామున 3.35 గంటలకు తాడి-అనకాపల్లి మార్గంలో బొగ్గు లోడ్‌తో వస్తోన్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో.. ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. దీంతో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు పాసింజర్ రైళ్లను, ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసింది రైల్వే శాఖ.

ఈ లిస్టులో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, విశాఖ నుంచి గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, రత్నాచల్, ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను ఇవాళ రద్దు చేయగా.. గుంటూరు నుంచి విశాఖపట్నానికి వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ జూన్ 15న కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా నడుస్తోందని పేర్కొంది. ఇప్పటికే రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్దరణ పనులను శరవేగంగా చేపడుతున్నారు.

అటు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్ల రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పష్టం చేసింది. విశాఖ-రాజమహేంద్రవరం(07467), రాజమహేంద్రవరం-విశాఖ(07466), కాకినాడ-విశాఖ(17267) ఎక్స్‌ప్రెస్, విశాఖ-కాకినాడ(17268) ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈనెల 18వ తేదీ వరకు రద్దు చేసింది.