TTD: శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పిన టీటీడీ.. ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు..

Tirumala Temple: తిరుమలేశుడి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 25వ తేదీన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

TTD: శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పిన టీటీడీ.. ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు..
Ttd

Updated on: Apr 21, 2022 | 6:13 PM

Tirumala Temple: తిరుమలేశుడి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 25వ తేదీన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. జులై నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయడం జరుగుతుందని తెలిపింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి.. ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరింది. కాగా, కరోనా ప్రభావం తగ్గడంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తిరుమలేశుడి సన్నిధికి భక్తులు పోటెత్తుతున్నారు. అదే సమయంలో టీటీడీ కూడా భక్తుల రాకను బట్టి శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్జిత సేవా టికెట్లను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.

Also read:

YSRCP Politics: సీఎం జగన్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా? ఆ జిల్లా రాజకీయాలు ఏ టర్న్ తీసుకోబోతున్నాయి..!

Kodanadu Case – VK Sasikala: కొడనాడు ఎస్టేట్ కేసులో శశికళను విచారించిన పోలీసులు.. చిన్నమ్మ రియాక్షన్ ఇదీ..!

Hyderabad: ఇవాళ హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం.. పూర్తి వివరాలివే..

Follow Us