Godavari Floods: కోనసీమలో ఒకపక్క వరదలు ముచ్చెత్తి ఇబ్బందులు పడుతుంటే మరో పక్క మాత్రం అసలు తగ్గే లేదు అంటున్నారు కొందరు వ్యక్తులు. గోదావరి ఒడ్డున ఉన్న రిసార్ట్స్ మోకాళ్ళ లోతు మునిగిపోయినా వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేయడం మానలేదు. ఏకంగా మోకాళ్ళ లోతు నీళ్లలోనే బల్లలు వేసుకుని స్నేహితులతో తింటూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది ఏ ప్రాంతంలో జరిగిందో తెలియదు గానీ, గోదావరి నీటిలో ఇలా ఎంజాయ్ చేయడం గోదారోళ్ళకు మాత్రమే సాధ్యమైంది అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిన్న పి.గన్నవరం లో పీకల్లోతు నీళ్లలో వాలీబాల్ ఆడిన యువకులు ఇప్పుడు ఇలా గోదావరి నీళ్లలో ఏకంగా పార్టీనే చేసుకుంటున్న గోదారోళ్ళు..
జూలై నెలలోనే తెలుగు రాష్ట్రాలపై వరుణుడు ప్రతాపం చూపించాడు. దాదావు వారం రోజుల పాటు కుండపోత వర్షాలు కురిశాయి. ఏపీ కంటే తెలంగాణలో అధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా గోదావరి క్యాచ్ మెంట్ ఏరియాలో కుంభవృష్టి కురిసింది. కుండపోత వానలతో వరదలు పోటెత్తాయి. గోదావరి మహోగ్రరూపం దాల్చింది. రికార్డ్ స్థాయిలో వరదొచ్చింది. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం ఏకంగా 72.8 అడుగులకు చేరింది. పోలవరం మీదుగా దాదాపు 28 లక్షల వరద ప్రవహించింది. ధవళేశ్వరంలోనూ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరదలు పోటెత్తడంతో గోదావరి తీర గ్రామాలు నీట మునిగాయి. వందలాది గ్రామాలు దాదాపు వారం రోజుల పాటు జలమయం అయ్యాయి. వేలాదిమందిని పునరావస కేంద్రాలకు తరలించారు. భద్రాచలంలో నీటిమట్టం 48 అడుగులకు తగ్గినా ఇంకా పలు లంక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి