Vizag Investors Summit Updates: పరిపాలన రాజధాని విశాఖే.. నేను కూడా ఇక్కడికే షిఫ్ట్‌ అవుతా.. సీఎం జగన్‌..

|

Mar 03, 2023 | 6:33 PM

Global Investors Summit in Visakhapatnam Updates: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహిస్తోంది. GIS 2023 కు విశాఖపట్నంలో జరిగింది.

Vizag Investors Summit Updates: పరిపాలన రాజధాని విశాఖే.. నేను కూడా ఇక్కడికే షిఫ్ట్‌ అవుతా.. సీఎం జగన్‌..
CM YS Jagan

Global Investors Summit in Visakhapatnam Updates: విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో పాటు, కేంద్రమంత్రులు, 46 మంది దౌత్యవేత్తలు, 30 మంది గ్లోబల్‌ బిజినెస్‌ లీడర్లు, 25 దేశాలకు చెందిన 14 వేల మంది ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. ఏపీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు 345 ప్రతిపాదనలు వచ్చాయన్నారు సీఎం . వాటి విలువ 13 లక్షల కోట్లు అని ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడుల కోసం ప్రత్యేక డెస్క్‌ ఏర్పాటు చేస్తామన్న సీఎం.. 21 రోజుల్లో అనుమతుల మంజూరు చేస్తామన్నారు.

మూడు రాజధానులపై మరోసారి స్పష్టత ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్. ప్రముఖ వ్యాపారవేత్తలు, వేలాది మంది అతిధుల మధ్య ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ నగరంగా విశాఖ ఉంటుందని స్పష్టమైన ప్రకటన చేశారు. గతంలో ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలే మరోసారి సాగరతీరం సాక్షిగా చెప్పారు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా 11లక్షల 87 వేల 756 కోట్ల విలువైన 92 ఒప్పందాలు చేసుకుంది ఏపీ సర్కార్‌. NTPCతో 2 లక్షల 35 వేల కోట్లు, ABC లిమిటెడ్‌తో లక్షా 20 వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంది. రెన్యూ పవర్‌తో 97 వేల 550 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.

లైవ్ కోసం ఇక్కడ చూడండి

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Mar 2023 05:43 PM (IST)

    స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మేం రెడీ..

    ఏపీలోని క్రిష్ణ పట్నం సమీపంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జిందాల్ గ్రూపు ఛైర్మన్ నవీన్ జిందాల్ సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకోసం రూ.10వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని జిందాల్ అన్నారు.

  • 03 Mar 2023 05:41 PM (IST)

    ఏపీలో.. ముఖేశ్ అంబానీ భారీ ప్రకటన

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించారు.

  • 03 Mar 2023 05:39 PM (IST)

    గతంలో కంటే భిన్నంగా..

    దేశ, విదేశీ కార్పోరేట్‌ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే టార్గెట్గా ఏర్పాటు చేసిన ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023’ గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా జరుగుతోంది. ముఖేష్‌ అంబానీ, కుమార మంగళం బిర్లా వంటి 30కి పైగా కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు. పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు ఇలా ఉన్నాయి.

  • 03 Mar 2023 04:33 PM (IST)

    ఏపీలో హెల్త్ కేర్ రంగంలో అభివృద్ధికి కృషి చేస్తాం – అపోలో గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌

    ఏపీలో హెల్త్ కేర్ రంగంలో అభివృద్ధికి కృషి చేస్తామని అపోలో గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌ ప్రీతా రెడ్డి గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్లో తెలిపారు. హెల్త్‌ కేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో త్వరగా వైద్య సేవలు అందించవచ్చని చెబుతున్నామన్నారు ప్రీతా రెడ్డి.

  • 03 Mar 2023 04:31 PM (IST)

    ఏపీకి రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు – సీఎం జగన్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెప్పగలనని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయన్నారు. తొలిరోజు 92 ఎంవోయూలు రాగా మొత్తం 340 ఎంవోయూలు.. దీని ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. దేశ ప్రగతిలో​ ఏపీ కీలకంగా మారిందన్నారు. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఏపీలో కీలక రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చామని సీఎం జగన్ అన్నారు.

  • 03 Mar 2023 04:06 PM (IST)

    6 లేన్ల వైజాగ్ పోర్ట్ హైవేకు గడ్కరీ ఆమోదం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నేడు నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తోందన్నారు. అదే సమయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తున్నందుకు సంతోషంగా ఉందని కొనియాడారు.

    ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. “చాలా కాలంగా సీఎం జగన్‌ 6 లేన్ల వైజాగ్ పోర్ట్ హైవే కు సంబంధించి ఒక ముఖ్యమైన డిమాండ్‌ నా ముందు ఉంచారు. ఈ రహదారి 55 కిలోమీటర్ల మేర ఉంటుంది, మరియు ఖర్చు రూ.6300 కోట్లు అంచనా.” అని గడ్కరీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్లు సభా సమక్షంలో తెలిపారు. రాష్ట్ర అభివ్రుద్ధికి తన సహకారాన్ని అందించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

  • 03 Mar 2023 02:43 PM (IST)

    విశాఖతో పాటు అనేక సహజ వనరులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – ముఖేష్

    నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ రాష్ట్రం కీలక పాత్ర పోషించనుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. గురువారంనాడు విశాఖపట్టణంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ప్రసంగించారు. విశాఖపట్టణంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగస్వామ్యమైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందని.. రిలయన్స్ సంస్థలో మేనేజర్లుగా పనిచేసేవారిలో ఎందరో ఏపీ రాష్ట్రానికి చెందినవారున్నారని అన్నారు. తిరుపతి, విశాఖపట్టణం వంటి పట్టణాలతో పాటు అనేక సహజ వనరులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖేష్ అంబానీ తెలిపారు. పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ రాష్ట్రానికి చెందినవారున్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

  • 03 Mar 2023 01:33 PM (IST)

    విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

    విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ మొదటిరోజు కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు.మరికాసేపట్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు గడ్కరీ చేరుకుని.. ప్రసంగించనున్నారు.

  • 03 Mar 2023 01:24 PM (IST)

    పరిపాలన రాజధాని విశాఖే..

    గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ వేదికగా సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలన రాజధాని విశాఖే అని.. తాను కూడా ఇక్కడికే షిఫ్ట్‌ అవుతానంటూ జగన్‌ పేర్కొన్నారు. ఇది త్వరలోనే సాకరమవుతుందని స్పష్టంచేశారు.

  • 03 Mar 2023 01:03 PM (IST)

    ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు

    ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. తద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు.

  • 03 Mar 2023 01:02 PM (IST)

    తొలిరోజు 8.54 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు

    దేశంలో అత్యధిక సముద్రతీర ప్రాంతం ఉందని.. ఆరు ఓడ రేవులు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నాయని.. సహజ వనరులతో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతుందని జగన్‌ తెలిపారు. తొలిరోజు 8.54 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు ఇవాళ జరుగుతాయని.. మరిన్ని రేపు జరుగుతాయని జగన్‌ వివరించారు.

  • 03 Mar 2023 12:58 PM (IST)

    భారతదేశంలో కీలకమైన రాష్ట్రం ఏపీ.. వైఎస్ జగన్

    భారతదేశంలో కీలకమైన రాష్ట్రం ఏపీ అని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్స్‌ ముందుకు వచ్చారని తెలిపారు. 340 పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. వీటితో 6 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని జగన్‌ పేర్కొన్నారు. పెట్టుబడులకే కాదు.. ప్రకృతి అందాలకు విశాఖ నగరం నెలవు అంటూ సీఎం జగన్‌ పేర్కొన్నారు.

  • 03 Mar 2023 12:52 PM (IST)

    భారతదేశానికి ఏపీ ఎంతో ముఖ్యం.. ముఖేశ్‌ అంబానీ

    భారతదేశానికి ఏపీ ఎంతో ముఖ్యమని రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ పేర్కొన్నారు. రాష్ట్రంలో 5జీ నెట్‌వర్క్‌ 90శాతం కవర్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు.

  • 03 Mar 2023 12:49 PM (IST)

    ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది..

    ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని గ్రంధి మల్లికార్జున రావు తెలిపారు. ఇందుకు అనేక గణాంకాలు ఉదాహరణగా ఉన్నాయన్నారు. హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ద్వారా లక్ష ఉద్యోగాలు అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు తరలిరావాలని జీఎంఅర్ సైతం పిలుపునిస్తుందన్నారు.

  • 03 Mar 2023 12:45 PM (IST)

    5000 కోట్లు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాం.

    హరి మోహన్ బంగూర్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ సిమెంట్స్..

    ఆంధ్రప్రదేశ్‌లో మరో 5000 కోట్లు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాం.

    కొత్త పెట్టుబడి ద్వారా 5000 మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది

    దానివల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా 1000 కోట్ల సహకారం లభిస్తుంది

  • 03 Mar 2023 12:35 PM (IST)

    స్పష్టమైన విజన్ తో ఖర్చు.. బివిఆర్ మోహన్ రెడ్డి

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విజన్ తో విద్యపై ఎక్కువ ఖర్చు చేస్తోంది

    1.12 లక్షల కోట్ల ను విద్యారంగం పై జగన్ మోహన్ రెడ్డి వెచ్చించడం జగన్ దూరదృష్టికి నిదర్శనం

    ఆంధ్ర ప్రదేశ్ దేశానికి నాలెడ్జ్ క్యాపిటల్ అవుతుందన్న నమ్మకం ఉంది

    విశాఖ లో సాంకేతిక రంగంలో రెండంకెల వృద్ది ని సాధిస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇస్తున్నాను

  • 03 Mar 2023 12:19 PM (IST)

    సీఎం జగన్‌ విజన్‌ అద్భుతం.. జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు

    సీఎం జగన్‌ విజన్‌ అద్భుతమంటూ జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు కొనియాడారు. సీఎం జగన్‌ దార్శనికత ప్రశంసనీయమని.. ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగిందని పేర్కన్నారు. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు.

  • 03 Mar 2023 12:16 PM (IST)

    ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్‌ కృషి అభినందనీయం.. అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి

    ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్‌ కృషి అభినందనీయమని అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి పేర్కొన్నారు. ఏపీ సర్కార్‌తో అపోలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎ‍స్పార్‌ సేవలను ప్రీతారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

  • 03 Mar 2023 11:21 AM (IST)

    ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌వన్‌.. మంత్రి బుగ్గన

    ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో కాస్మోపాలిటిన్ కల్చర్ ఉందని తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని బుగ్గన వివరించారు. బిజినెస్‌ ఇండస్ట్రీలపై సీఎం జగన్‌ మంచి దార్శినికతతో ఉన్నారని.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉందని తెలిపారు.

  • 03 Mar 2023 11:10 AM (IST)

    అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.. మంత్రి గుడివాడ అమర్నాథ్‌

    ఏపీలో పారిశ్రామిక రంగానికి అవసరమైన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. ఏపీ మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్‌ పాలన చేస్తున్నారని తెలిపారు.

  • 03 Mar 2023 11:10 AM (IST)

    ప్రారంభోపన్యాసం చేసిన జవహార్ రెడ్డి

    జీఐఎస్‌ సదస్సు ప్రారంభంలో ఏపీ రాష్ట్ర గీతం ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ ఆలాపన చేశారు. సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రసంగించిన సీఎస్‌ జవహర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం మంత్రులు గుడివాడ అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాధ్ మాట్లాడారు.

  • 03 Mar 2023 10:46 AM (IST)

    జీఐఎస్ సదస్సును ప్రారంభించిన సీఎం జగన్‌

    పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి సీఎం జగన్‌ జీఐఎస్ సదస్సును ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.

  • 03 Mar 2023 10:44 AM (IST)

    దిగ్గజాలకు స్వాగతం

    సమ్మిట్‌కు హాజరైన కార్పొరేట్‌ దిగ్గజాలకు స్వాగతం పలికారు సీఎం జగన్‌. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి సాదర స్వాగతం పలికారు.

  • 03 Mar 2023 09:57 AM (IST)

    సమ్మిట్ పాల్గొనే భారత దిగ్గజ పారిశ్రామికవేత్తలు.. వీరే..

    జీఐఎస్ ప్రారంభ సెషన్‌లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ కీలక ప్రసంగాలు చేస్తారు. భారతదేశం నుంచి సమ్మిట్‌లో పాల్గొనే పారిశ్రామిక దిగ్గజాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ,  ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ KM బిర్లా,  శ్రీ సిమెంట్ లిమిటెడ్ చైర్మన్ హరి మోహన్ బంగూర్,  JSW గ్రూప్ సజ్జన్ చైర్మన్ జిందాల్,  బజాజ్ ఫిన్సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్ , CEO సంజీవ్ బజాజ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మన్ నవీన్ జిందాల్ పాల్గొననున్నారు. ఈ మేరకు అంబానీ ఇప్పటికే వైజాగ్ చేరుకున్నారు.

  • 03 Mar 2023 09:53 AM (IST)

     30 మంది గ్లోబల్ బిజినెస్ లీడర్లు

    జీఐఎస్ సమ్మిట్‌లో 46 మంది దౌత్యవేత్తలు, 30 మంది గ్లోబల్ బిజినెస్ లీడర్లు పాల్గొననున్నారు.  25 దేశాలకు చెందిన 14వేల మంది ప్రతినిధులు హాజరుకున్నారు.

  • 03 Mar 2023 09:51 AM (IST)

    జ్యోతి ప్రజ్వలనతో సమ్మిట్ ను ప్రారంభించనున్న సీఎం జగన్

    • మరికాసేపట్లో ప్రారంభంకానున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్
    • జ్యోతి ప్రజ్వలనతో సమ్మిట్ ప్రారంభించనున్న సీఎం జగన్
    • సమ్మిట్‌కు హాజరుకానున్న కార్పొరేట్ దిగ్గజాలు, కేంద్ర మంత్రులు
    • సమ్మిట్‌లో పాల్గొననున్న 46 మంది దౌత్యవేత్తలు
    • 30 మంది గ్లోబల్ బిజినెస్ లీడర్లు..
    • 25 దేశాలకు చెందిన 14వేల మంది ప్రతినిధులు
    • రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల అంచనాలు
    • రెండు రోజుల సదస్సులో పలు కీలక ఒప్పందాలు
    • సదస్సులో 14 కీలక రంగాలపై ప్రధానంగా దృష్టి
    • విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో భారీ భద్రత
  • 03 Mar 2023 09:43 AM (IST)

    ఫ్రెండ్లీ పాలసీలతో..

    సుదీర్ఘమైన తీర ప్రాంతం, అంతకంటే విస్తృతమైన వనరులు, 70శాతం మేన్‌పవర్‌, అన్నింటికీ మించి ఇన్వెస్టర్స్‌ ఫ్రెండ్లీ పాలసీలు ఏపీ అడ్వాంటేజ్‌స్‌గా చెబుతోంది ప్రభుత్వం. ఈ సమ్మిట్‌ ద్వారా 2లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడం టార్గెట్‌గా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం.

  • 03 Mar 2023 09:13 AM (IST)

    కార్పొరేట్ దిగ్గజాలతో సీఎం జగన్ భేటీ..

    మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సీఎం ముఖాముఖి సమావేశాలు

    ముఖేష్‌ అంబానీ, కేఎం బిర్లా, కరణ్‌ అదానీ, అర్జున్‌ ఒబెరాయ్, సంజీవ్‌ బజాజ్, ఎబర్‌హార్డ్, నవీన్‌ జిందాల్, సుమిత్‌ బిదానీలతో ముఖాముఖి చర్చలు

    రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని స్వయంగా వివరించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్..

  • 03 Mar 2023 08:46 AM (IST)

    భారీగా భద్రతా ఏర్పాట్లు

    కార్పొరేట్‌ ప్రముఖుల భద్రత కోసం భారీగా భద్రతా ఏర్పాట్లు

    ఈ మేరకు 2500 సిబ్బందిని మోహరించారు.

    విమానాశ్రయం నుంచి నేరుగా సభా స్థలికి చేరుకునేందుకు మూడు హెలిపాడ్స్‌ సిద్ధం

    సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాల ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించేందుకు సభా ప్రాంగణం వద్దే కంట్రోల్ రూం ఏర్పాటు

    కంట్రోల్ రూం ను పర్యవేక్షిస్తున్న నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్

  • 03 Mar 2023 08:44 AM (IST)

    లక్ష్యాన్ని వివరించనున్న మంత్రులు..

    లేజర్ షో, ప్రార్థనా గీతం అనంతరం సమావేశ లక్ష్యాన్ని వివరించనున్న పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖా మంత్రి అమర్, ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి..

    Gis

  • 03 Mar 2023 08:22 AM (IST)

    హాజరుకానున్న 46 దేశాల నుంచి 15వేలమంది ప్రతినిధులు

    • విశాఖలో కాసేపట్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ప్రారంభం
    • హాజరుకానున్న 46 దేశాల నుంచి 15వేలమంది ప్రతినిధులు
    • మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ భేటీ
    • సమ్మిట్‌కు హాజరుకానున్న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ
    • సదస్సుకు వస్తున్న టాప్‌-35 పారిశ్రామికవేత్తలు
  • 03 Mar 2023 08:19 AM (IST)

    2లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే టార్గెట్..

    ఈ సమ్మిట్‌ ద్వారా 2లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడం టార్గెట్‌గా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్లోబల్‌ సమ్మిట్‌ ద్వారా 15 రంగాల్లో ఎంవోయూలు కుదుర్చుకోనుంది సర్కార్‌.

  • 03 Mar 2023 08:18 AM (IST)

    12వేలకు పైగా రిజిస్ట్రేషన్లు..

    రెండ్రోజులపాటు జరిగే ఈ సమ్మిట్‌కి ఇన్వెస్టర్స్‌ నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఇప్పటికే 12వేలకు పైగా రిజిస్ట్రేషన్‌ జరిగాయ్‌. ఇండియాలోని టాప్‌-35 ఇండస్ట్రియలిస్ట్‌లు, 25 కంట్రీస్‌ నుంచి బిజినెస్‌ టైకూన్స్‌, హైకమిషనర్లు ఈ సమ్మిట్‌కి హాజరుకాబోతున్నారు. అంబానీ, అదానీ, మిట్టల్‌, బజాజ్‌, ఆదిత్యా బిర్లా, జిందాల్‌, జీఎంఆర్‌ లాంటి అనేకమంది పారిశ్రామిక దిగ్గజాలు 25 ప్రత్యేక విమానాల్లో ఈ సమ్మిట్‌కి రాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు నితిన్‌ గడ్కరీ, కిషన్‌రెడ్డి అటెండ్‌ కాబోతున్నారు.

Follow us on