Andhra Pradesh: నంద్యాల జిల్లాలో దారుణం.. మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక.. చివరకు..

|

Jul 10, 2024 | 12:46 PM

నంద్యాల జిల్లా పగిడియాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక దారుణ హత్యకు గురైంది. హత్య జరిగిన స్థలంలో క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు కూడా కనిపించడంతో స్థానికంగా కలకలం రేపింది. అయితే మూడు రోజుల క్రితం పార్కులో ఆడుకుంటున్న బాలిక అదృశ్యమైంది.

Andhra Pradesh: నంద్యాల జిల్లాలో దారుణం.. మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక.. చివరకు..
Crime News
Follow us on

నంద్యాల జిల్లా పగిడియాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక దారుణ హత్యకు గురైంది. హత్య జరిగిన స్థలంలో క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు కూడా కనిపించడంతో స్థానికంగా కలకలం రేపింది. అయితే మూడు రోజుల క్రితం పార్కులో ఆడుకుంటున్న బాలిక అదృశ్యమైంది. కూతురు కనిపించకపోవడంతో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి ఫిర్యాదు చేశారు బాధితులు. శబరి ఆదేశాలతో పోలీసులు ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించారు.. జాగిలాలతో రెండు రోజులు గ్రామమంతా సెర్చ్ంగ్‌ చేసిన పోలీసులు ఎట్టకేలను బాలిక శవాన్ని కనిపెట్టారు. అయితే, చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. హత్య జరిగిన స్థలంలో క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు కూడా కనిపించాయి. ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. ముగ్గురిలో ఒకరు నేరాన్ని అంగీకరించడంతో బాలిక హత్య మిస్టరీ బయటపడింది.. బాలికను అత్యాచారం చేసి చంపేసిన ముగ్గురు మైనర్లు.. అనంతరం శవాన్ని కాలువలో పడేశారు.

ఏం జరిగిందంటే..

మూడు రోజుల క్రితం పార్కులో ఆడుకుంటున్న బాలికను ముగ్గురు మైనర్లు ఎత్తుకెళ్లిపోయారు. అనంతరం బాలికను అత్యాచారం చేశారు. ఈ విషయం ఇంట్లో చెబుతుందనే భయంతో బాలికను చంపి శవాన్ని కాలువలో పడేశారు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా ఘటనా స్థలంలో క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు క్రియేట్‌ చేశారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి రంగంలోకి దిగడంతో ఇన్వెస్టిగేషన్‌ స్పీడప్‌ చేసిన పోలీసులు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం దర్యాప్తు చేపట్టారు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి.. కాల్వలో పడేసిన బాలిక మృతదేహం కోసం ప్రస్తుతం వెతుకుతున్నారు.

వీడియో చూడండి..

కాగా.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..