AP News: ఆలయంలో దొంగతనం చేసిన కేటుగాళ్లు.. రెండు గంటల్లోనే దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు..

|

Jul 20, 2022 | 6:26 PM

ఆలయ పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెంటనే చేధించారు. పోలీసులు.. నిందితుడు తిరిగిన ప్రాంతాలలో సిసి ఫుటేజ్‌లో ఆధారంగా ఎటువైపు వెళ్ళాడో గుర్తించారు.

AP News: ఆలయంలో దొంగతనం చేసిన కేటుగాళ్లు.. రెండు గంటల్లోనే దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు..
Ap News
Follow us on

Prakasam district police: ప్రకాశం జిల్లా గిద్దలూరులో పోలీసులు దొంగతనం కేసును కేవలం రెండు గంటల్లోనే చేధించి రికార్డు సృష్టించారు. గిద్దలూరు మండలం మిట్టమీద పల్లి గ్రామ సమీపంలోని కాశినాయన ఆలయంలో దొంగలు పడ్డారు. దొంగలు.. ఆలయంలో ఉన్న కాశీనాయన పంచలోహల విగ్రహంతో పాటు ఆలయం బయట ఉన్న కమాండర్ జీపును దొంగలించారు. ఆలయ పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెంటనే చేధించారు. పోలీసులు.. నిందితుడు తిరిగిన ప్రాంతాలలో సిసి ఫుటేజ్‌లో ఆధారంగా ఎటువైపు వెళ్ళాడో గుర్తించారు. పోలీసులు తమను గుర్తించారన్న భయంతో నిందితుడు పెద్దారవీడు గ్రామ సమీపంలో జీపు పంచలోహాల విగ్రహాన్ని వదిలేసి పరారయ్యారు. వేగంగా అక్కడికి చేరుకున్న సీఐ ఫిరోజ్, ఎస్ఐ బ్రహ్మనాయుడు నిందితుడు దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాధితులకు ఆ వస్తువులను అందజేశారు. వేగంగా దొంగతనం కేసును చేదించి దొంగిలించిన వస్తువులను తిరిగి అందించిన పోలీసులకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.

కాగా.. దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు.. ఈ ప్రాంతం వారా..? బయటి ప్రాంతం నుంచి వచ్చారా..? అన్న విషయాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగల కోసం సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

Ap Police

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..