స్నేహం ముసుగులో మోసం.. తక్కువ ధరకే బంగారం ఇస్తానని.. నకిలీ సరకు ముట్టజెప్పి

|

Feb 24, 2022 | 9:41 AM

బెల్ట్ షాపు వద్ద ఏర్పడిన పరిచయంతో స్నేహితులుగా మారారు. తన వద్ద బంగారం ఉందని, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తానని నమ్మించాడు. నమ్మి, బంగారం తీసుకున్న ఫ్రెండ్ ను..

స్నేహం ముసుగులో మోసం.. తక్కువ ధరకే బంగారం ఇస్తానని.. నకిలీ సరకు ముట్టజెప్పి
Cheating
Follow us on

బెల్ట్ షాపు వద్ద ఏర్పడిన పరిచయంతో స్నేహితులుగా మారారు. తన వద్ద బంగారం ఉందని, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తానని నమ్మించాడు. నమ్మి, బంగారం తీసుకున్న ఫ్రెండ్ ను నట్టేట ముంచాడు. రూ.15 లక్షలు తీసుకుని నకిలీ బంగారం(Fake gold) అప్పగించాడు.కొంత దూరం వెళ్లాక.. విషయాన్ని గుర్తించిన బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అత్యాశకు పోయి, మోసపోయామని(Cheating) బాధితులు తలలు పట్టుకుంటున్నారు.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటకు చెందిన సుధీర్‌ కు అనంతపురం(Anantapur) జిల్లాకు చెందిన నవీన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల క్రితం సొంతూరుకు వెళ్లిన నవీన్‌.. తరచూ సుధీర్‌కు ఫోన్‌ చేసేవాడు. దీంతో వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది.స్నేహాన్ని ఆసరాగా తీసుకున్న నవీన్.. తన వద్ద కిలో బంగారు పూసలు ఉన్నాయని, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తామని నమ్మబలికాడు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లికి రావాలని సుధీర్ ను కోరాడు.

నవీన్ మాటలు నమ్మిన సుధీర్.. తన స్నేహితులతో కలిసి అనంతపురం వెళ్లాడు. నవీన్ వద్ద ఉన్న బంగారాన్ని అసలు బంగారమేనని వారు భ్రమపడ్డారు. ఆ బంగారం విలువ రూ.20లక్షలు అని చెప్పి, రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ నెల 21న గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద రూ.15లక్షలు ఇచ్చి పూసలు తీసుకున్నారు. వాటిని క్షుణ్నంగా పరిశీలించగా.. అవి నకిలీవని తేలాయి. వెంటనే గోరంట్లకు చేరుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read

Stock Market: T+1 సెటిల్‌మెంట్‌కు సన్నాహాలు.. మొదటగా కొన్ని స్టాక్‌ల్లోనే..

IIM Bangalore క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో 513 విద్యార్ధులకు 662 ఆఫర్లు..గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌తో సహా టాప్ కంపెనీలు..

RERA: మీరు బిల్డర్‌కు డబ్బు చెల్లించి సంవత్సరాలు గడిచిపోతున్నాయా.. అయితే మీకిది శుభవార్తే..