
పిల్లలను విహారయాత్రకు తీసుకెళ్లిన మూడు ప్రైవేట్ బస్సులతో పాటు మరో ట్రావెల్స్ బస్సు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటన రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్‌చెరువు దగ్గర వెలుగు చూసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మూడు అంబులెన్స్‌ల సహాయంతో క్షతగాత్రులను హస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో సుమారు 26 మంది విద్యార్థులు గాయపడినట్టు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా గుండ్లపల్లి ప్రభుత్వ పాఠశాల, కళాశాలకు చెందిన సుమారు 80 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి మూడు రోజుల క్రితం రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో విహారయాత్రకు వెళ్లారు. టూర్‌లో బాగంగా అరకు, పాడేరు సహా మిగతా టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. అయితే సరిగ్గా రాజమహేంద్రవరం దివాన్‌చెరువు వద్దకు రాగానే ఒక గేదె అడ్డు రావడంతో ముందు వెళ్తున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ సడన్‌బ్రేక్ వేశాడు. దీంతో వెనుక పిల్లలతో ప్రయాణిస్తున్న రెండు బస్సులు, మరో ట్రావెల్ బస్సు ఒకదానినొకటి ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో సుమారు 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన విద్యార్థులను హాస్పిటల్‌కు తరలించారు. మిగిలిన విద్యార్థులను దివాన్‌చెరువులోని బాలవికాస్ మందిరానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.