Four died fell into a pond in kuppam: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన నలుగురు నీటికుంటలో పడి మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు.. ఇద్దరు మహిళలు ఉన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని చింపనగల్లు గ్రామంలోని నీటికుంటలో బట్టలు ఉతికేందుకు తల్లీ, ఇద్దరు కూతుళ్లతో సహా మరో సమీప బంధువు వెళ్లారు. ఈ క్రమంలో కీర్తి(6) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడిపోయింది. కీర్తిని కాపాడబోయి అక్క హారతి (8) కూడా నీటిలో మునిగిపోయింది. వీరిని కాపాడే క్రమంలో రుక్మిణి(32), సమీప బంధువైన గౌరమ్మ (42) కూడా నీటిలో మునిగి మరణించారు. కాగా.. ఉదయం బట్టలు ఉతికేందుకు వెళ్లి నలుగురు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చింపనగల్లు నీటికుంటలో నలుగురి మృతదేహాలను గుర్తించారు. దీంతో చిపనగల్లులో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read:
Crime News: “ఎటు వెళ్తుంది ఈ సమాజం..?”.. సోషల్ మీడియాలో అక్కపై తమ్ముడి లైంగిక వేధింపులు