Pawan Kalyan: జనసేనలోకి మాజీ మంత్రి.. ఆ పార్లమెంట్ సీటుపై పవన్‎తో చర్చించిన కీలక నేత..

|

Jan 18, 2024 | 8:00 AM

ఏపీలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. తెలుగుదేశం, జనసేన పొత్తులు ఖాయమైన నేపథ్యంలో పలువురు నేతలు పార్టీల్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా మంచి గుర్తింపు పొందారు.

Pawan Kalyan: జనసేనలోకి మాజీ మంత్రి.. ఆ పార్లమెంట్ సీటుపై పవన్‎తో చర్చించిన కీలక నేత..
Former Minister Konatala Ra
Follow us on

ఏపీలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. తెలుగుదేశం, జనసేన పొత్తులు ఖాయమైన నేపథ్యంలో పలువురు నేతలు పార్టీల్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా మంచి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానంలో పోటీ చేయాలని కొణతాల రామకృష్ణ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వ్యూహాలను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ తో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈనెలలోనే మంచి ముహూర్తం చూసుకొని జనసేన కండువా కప్పుకోబోతున్నారు కొణతాల. మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం జనసేనకు కలిసి వస్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్‌ భావిస్తున్నారు.

ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలతోపాటు ఉత్తరాంధ్రలో తాజా రాజకీయ పరిస్థితులపై పవన్ -కొణతాల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల.. నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో వున్నారు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆతరువాత 2009లో మరోసారి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ వైఎస్ఆర్ ప్రభావంతో మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొణతాల రాణించగలిగారు. అనంతరం రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ను వీడి అప్పట్లో జగన్ స్థాపించిన వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు రామకృష్ణ. తెలుగుదేశంలో చేరతారని వార్తలు వినిపించినప్పటికీ గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే రైతు సమస్యలు, షుగర్ ఫ్యాక్టరీలు మూతపడటంపై తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. దాదాపు ఐదేళ్ల విరామం తరువాత రాజీయంగా రీస్టార్ట్ అయి జనసేన పార్టీ తరఫున పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..