AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kodali Nani: లోకేశ్ కు అడ్డు వస్తాడని.. ఎన్టీఆర్ ను పాతాళానికి తొక్కేస్తున్నారు.. మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. లోకేశ్ కు అడ్డు...

Kodali Nani: లోకేశ్ కు అడ్డు వస్తాడని.. ఎన్టీఆర్ ను పాతాళానికి తొక్కేస్తున్నారు.. మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్..
Mla Kodali Nani
Ganesh Mudavath
|

Updated on: Dec 09, 2022 | 3:42 PM

Share

ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. లోకేశ్ కు అడ్డు వస్తాడనే జూనియర్ ఎన్టీఆర్ ను పాతాళానికి తొక్కేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. లోకేశ్ ను ప్రజలపై రుద్ది, ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ డీఎన్ఏ అయిన బీసీలను సమూలంగా నాశనం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని అక్రమించాలని పన్నాగాలు పన్నుతున్నారన్న కొడాలి నాని.. జోగి రమేష్ మంత్రి అయితే తాను, పేర్ని నాని, వల్లభనేని వంశీ మత్రులు అయినట్లేనని వెల్లడించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ కలిస్తే ఉండేంత దమ్ము ధైర్యం కేవలం జగన్ కు మాత్రమే ఉందని, అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఏపీ ప్రజలకు ఉందని కొడాలి నాని స్పష్టం చేశారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక సందర్భం నమోదైంది. చాలా రోజుల తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధ కలుసుకున్నారు. ఇద్దరూ మిత్రులే.. గతంలోనూ చాలా సార్లు కలిసారు. కానీ ఈసారి రాధా రాక కోసం కొడాలి నాని అరగంట పాటు వెయిట్‌ చేశారు. రాధా రాగానే ఆయన కారు వద్దకు వెళ్లి రిసీవ్ చేసుకున్నారు నాని. సరదాగా మాట్లాడారు. ఈ సీన్‌ ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. గుడివాడలో వైసీపీ నేత కూతురు వివాహ వేడుకలో పాల్గొన్నారు కొడాలి నాని, వంగవీటి రాధ. వధూవరుల్ని ఆశీర్వదించాక.. ఆత్మీయంగా చాలాసేపు మాట్లాడుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..