Balineni Srinivas: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌!

Balineni Srinivas: వైఎస్సార్‌ నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేనేత దినోత్సవం సందర్భంగా ఛాలెంజ్‌ విరిరారు. బాలినేనితో పాటు..

Balineni Srinivas: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌!

Updated on: Aug 08, 2022 | 5:25 AM

Balineni Srinivas: వైఎస్సార్‌ నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేనేత దినోత్సవం సందర్భంగా ఛాలెంజ్‌ విరిరారు. బాలినేనితో పాటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌లకు పవన్‌ కల్యాన్‌ ఈ ఛాలెంజ్‌ విసిరారు. ఈ మేరకు ఆదివారం ట్విట్‌ చేసిన పవన్‌.. చంద్రబాబు, బాలినేని, లక్ష్మణ్‌లకు ట్యాగ్‌ చేస్తూ చేనేత దుస్తులు ధరించి ఫోటోలు దిగాలని కోరారు. పవన్‌ ఛాలెంజ్‌పై బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి స్పందించారు. చేనేత దుస్తులు ధరించి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఛాలెంజ్‌ను స్వీకరించానని తెలిపారు.


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో చేనేత మంత్రిగా పనిచేశాను. నాడు వైఎస్‌ఆర్‌ చేతి వృత్తులకు మూడు వందల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి చిత్తశుద్ధితో పనిచేశామని అన్నారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ‘వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం’ పథకంలో వారికి ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు. అప్పుడూ, ఇప్పుడూ చేతివృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధికి నిజాయితీగా పనిచేస్తున్నామని బాలినేని పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి