AP Panchayat Elections: సర్పంచ్‌ల ఏకగ్రీవాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌

AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అయితే మొదటి విడత నామినేషన్లలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో...

AP Panchayat Elections: సర్పంచ్‌ల ఏకగ్రీవాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌

Updated on: Feb 05, 2021 | 6:42 AM

AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అయితే మొదటి విడత నామినేషన్లలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 400లకుపై పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏకగ్రీవాలు లేనప్పుడు సర్పంచ్‌ పదవులకు మాత్రం ఎందుకని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. గురువారం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏకగ్రీవాలు అధికంగా అయితే అధికార వైఫల్యం కిందకు వస్తుందని అన్నారు. ఏకగ్రీవాల అధికమయితే ఒప్పుకునేది లేదన్నారు. కోవిడ్‌-19 అదుపులో ఉందని, ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు ఇబ్బందులు లేవని అన్నారు. ఎన్నికలను నిజాయితీగా నిర్వహించేలా ఉద్యోగులందరూ పని చేయాలన్నారు. గతంలో ఏకగ్రీవాలు 20 శాతం ఉంటే ప్రస్తుతం పది శాతానికి పడిపోయినట్లు చెప్పారు.

రాజ్యాంగం నిర్ధేశించిన విధంగా సజావుగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బాధ్యత అన్నారు. శాంతి భద్రతలు కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా అధికారులు చూడాలన్నారు. మీడియాతో కలిసి ఎన్నికల కమిషన్‌ పని చేస్తుందని అన్నారు. గత సంవత్సరం మార్చిలో ఏకగ్రీవమైన జడ్పీటీసీ, ఎంపీటీసీలను సమీక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Also Read: ఈ నెల 8 వరకు జైల్లోనే అచ్చెన్నాయుడు.. బెయిల్‌ పిటిషన్‌ విచారణ సోమవారానికి వాయిదా వేసిన సోంపేట కోర్టు