Andhra Pradesh and Telangana: తెలుగు రాష్ట్రాలను కమ్మేస్తున్న పొగమంచు.. భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

చలికాలం ఇలా మొదలయ్యిందో లేదో.. తెలుగు రాష్ట్రాలను పొగమంచు మేఘంలా కమ్మేస్తోంది. రమణీయ దృశ్యాలు ఓ వైపు ఆహ్లాదపరుస్తున్నా.. మరోవైపు వాహనదారులకు

Andhra Pradesh and Telangana: తెలుగు రాష్ట్రాలను కమ్మేస్తున్న పొగమంచు.. భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
Foggy Weather

Updated on: Nov 05, 2022 | 7:02 AM

చలికాలం ఇలా మొదలయ్యిందో లేదో.. తెలుగు రాష్ట్రాలను పొగమంచు మేఘంలా కమ్మేస్తోంది. రమణీయ దృశ్యాలు ఓ వైపు ఆహ్లాదపరుస్తున్నా.. మరోవైపు వాహనదారులకు నరకం చూపుతున్నాయి. అవును చలికాలం వచ్చిందంటే చాలు.. తెలుగురాష్ట్రాలు జమ్ముకశ్మీర్‌ను తలపిస్తున్నాయి. దట్టమైన పొగమంచుతో ఊరేదో.. అడవేదో.. రోడ్డేదో.. చెట్టేదో తెలియకుండా పోతోంది. సాధారణంగా అటవీ ప్రాంత సమీప గ్రామాలను పొగమంచు కమ్మడం తెలుసు. ఈ ఏడాది.. నగరాలను సైతం మంచుదుప్పటి కప్పేస్తోంది.

విజయవాడ, రాజమండ్రి, ఆదిలాబాద్‌, మెదక్‌ వంటి ప్రాంతాలను పొగమంచు కవ్విస్తోంది. దట్టంగా పరుచుకున్న మంచు రమణీయంగా కనిపిస్తూనే వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. కన్నుపొడుచుకున్నా ఎదురుగా ఏముందో కనిపించక ఇక్కట్లు పడుతున్నారు. విజయవాడ మచిలీపట్నం, రాజమండ్రి రైల్‌కమ్‌ బ్రిడ్జిపై అలుముకున్న దట్టమైన పొగమంచుతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. పచ్చని ప్రకృతి అందాలకు నెలవైన కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో.. చలి, పొగమంచు తీవ్రత మరింత పెరిగింది.

ఇక ఓ వైపు ఠారెత్తిస్తున్న చలి.. మరోవైపు పొగమంచుతో వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. భారీగా పడిపోతున్న ఉష్ణొగ్రతలతో జనం అవస్థలు పడుతున్నారు. ఉపశమనం కోసం చలిమంటలు కాచుకుంటున్నారు. సూర్యకిరణాలు తాకినా మంచుతెరలు వీడక ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచులో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారు అధికారులు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..