జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం.. ముగ్గురు మృతి, ఏడుగురికి సీరియస్

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై కారు వేగంగా దూసుకెళ్లింది. దీంతో రెండు బైకులు, ఒక రిక్షా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం.. ముగ్గురు మృతి, ఏడుగురికి సీరియస్
Kirlampudi Road Accident

Updated on: Nov 08, 2025 | 9:36 AM

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై కారు వేగంగా దూసుకెళ్లింది. దీంతో రెండు బైకులు, ఒక రిక్షా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నవరం నుంచి జగ్గంపేటకు వెళ్తున్న పెళ్లికారు ఫ్రంట్ టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘటనాస్థలానికి చేరుకు ప్రమాదంపై ఆరాతీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించారు అధికారులను కోరారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..