Andhra pradesh: రాయలసీమలో దంచికొడుతున్న వానలు.. దశాబ్దాల రికార్డులు బ్రేక్..

రుతుపవనాలు రాకముందే రాయలసీమలో(Rayalaseema) వర్షాలు దంచికొడుతున్నాయి. దశాబ్దాల రికార్డును తిరగరాస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు మూడు దశాబ్ధాల రికార్డును తిరగరాస్తున్నాయి. రుతుపవనాలు....

Andhra pradesh: రాయలసీమలో దంచికొడుతున్న వానలు.. దశాబ్దాల రికార్డులు బ్రేక్..
rayalaseema rains

Updated on: May 20, 2022 | 12:55 PM

రుతుపవనాలు రాకముందే రాయలసీమలో(Rayalaseema) వర్షాలు దంచికొడుతున్నాయి. దశాబ్దాల రికార్డును తిరగరాస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు మూడు దశాబ్ధాల రికార్డును తిరగరాస్తున్నాయి. రుతుపవనాలు(Monsoon) రాకముందే భారీ వర్షాలు కురవడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్యాపిలి మండలం చంద్రపల్లి, సిద్ధనగట్టు, హుసేనాపురం, నల్లమేకల పల్లెలో కురిసిన కుండపోత వర్షానికి ఆయా గ్రామాల్లోని పంటపొలాలు నీట మునిగాయి. చెరువులు, వాగులు, నదులను తలపిస్తున్నాయి. భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి కరెంటు స్తంబాలు విరిగిపడ్డాయి. వంతెనలు తెగిపోయాయి. పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గాలివానకు అరటి పంట నేలమట్టమైంది. హోళగుంద గ్రామంలో పిడుగుపాటుకు తండ్రీ, కుమారులు మృతి చెందారు. కడప జిల్లా పులివెందులలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. కాలువలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.

జూన్ 5 నుంచి జూన్ 10లోపు తెలంగాణలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అనుకూల వాతావరణం కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

NTR 31: ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌ ట్రీట్‌ వచ్చేసింది.. ఊరమాస్‌ లుక్‌లో అదరగొట్టిన తారక్‌..

Liposuction: కన్నడ నటి మృతికి కారణమిదే.. లైపోసెక్షన్‌ చికిత్సపై షాకింగ్ విషయాలు చెప్పిన నిపుణులు..