AP News: మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?

|

Oct 09, 2024 | 9:40 PM

ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరు 11 వరకు మద్యం షాపుల దరఖాస్తుల గడువును పొడగించినట్లు అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అన్‌లైన్‌తో సహా అన్ని విధానాలలో దరఖాస్తులకు 11వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు.

AP News: మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
Ap News
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరు 11 వరకు మద్యం షాపుల దరఖాస్తుల గడువును పొడగించినట్లు ఏపీ అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అన్‌లైన్‌తో సహా అన్ని విధానాలలో దరఖాస్తులకు 11వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. అక్టోబరు 12,13 తేదీలలో దరఖాస్తుల పరిశీలించనున్నట్లు వెల్లడించారు. 14వ తేదీన అయా జిల్లాలలో కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ తీయనున్నట్లు పేర్కొన్నారు. అదే రోజు కేటాయింపు ప్రకియ కూడా పూర్తి చేస్తామన్నారు. అక్టోబరు 16 వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అనుసరించి ప్రైవేటు మద్యం షాఫులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 3396 మద్యం దుకాణాలకు 57325 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. దరఖాస్తు ఫీజ్ రూపంలో ప్రభుత్వానికి 1146.50 కోట్ల అదాయం సమకూరినట్లు తెలుస్తుంది.

గడువు పొడిగింపు తర్వాత మరిన్ని దరఖాస్తులు వెల్లువెత్తుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, తిరుపతి, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అనంతపురం, నంద్యాలతో సహా పలు జిల్లాల్లో అందుబాటులో ఉన్న లైసెన్సు దుకాణాల సంఖ్యతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. లైసెన్సింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం మరియు మద్యం వ్యాపారంలో వ్యక్తుల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.