Madanapalle Incident: కూతుళ్ల హత్య కేసులో టీవీ9 చేతికి ఎక్స్‌క్లూజీవ్ దృశ్యాలు.. వెలుగులోకి మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు..

Madanapalle Incident: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిన చిత్తూరు జిల్లా మదనపల్లిలో కూతుళ్ల హత్య ఘటనకు సంబంధించి టీవీ9 కు ఎక్స్లూజీవ్..

Madanapalle Incident: కూతుళ్ల హత్య కేసులో టీవీ9 చేతికి ఎక్స్‌క్లూజీవ్ దృశ్యాలు.. వెలుగులోకి మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు..

Edited By:

Updated on: Jan 26, 2021 | 3:05 PM

Madanapalle Incident: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిన చిత్తూరు జిల్లా మదనపల్లిలో కూతుళ్ల హత్య ఘటనకు సంబంధించి టీవీ9 కు ఎక్స్లూజీవ్ దృశ్యాలు లభించాయి. 14 నిమిషాల ఈ ఫుటేజీలో కీలక దృశ్యాలు ఉన్నాయి. విచారణ సందర్భంగా మృతుల తల్లిదండ్రులు పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానాలు ఇచ్చారు. తమ కూతుళ్లకు దెయ్యం పట్టిందని, అందుకే డంబెల్స్‌తో కొట్టి చంపామని అన్నారు. దెయ్యం వదిలాక వారిద్దరూ మళ్లీ బతుకుతారంటూ వింత సమాధానాలు ఇచ్చారు. ఇది విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అంతేకాదు.. ‘మా ఇంట్లో కొన్ని రోజులుగా ఎన్నో మహిమలు జరిగాయి. అవి మీకు చెప్పినా అర్థం కావు. మా ఇంట్లో దేవుళ్లు ఉన్నారు పూజలతోనే చిన్న కూతురు సాయి దివ్య ఆరోగ్య సమస్యలను తగ్గించాము. వారం రోజులుగా అర్థరాత్రి 12 గంటలకు ఇంటి బయట ఎన్నో పూజలు చేశాము. 10 రోజులుగా తిండి లేకుండా ఉన్నాము. కలియుగం నేటితో అంతం అయ్యింది. సత్య యుగం ఇప్పుడే మొదలైంది మా ఇద్దరు కుమార్తెలను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాము. వారిద్దరూ చదువుల్లో నెంబర్ వన్. మేము పూర్తి జ్ఞానంతోనే ఉన్నాము. మాకు ఏం కాలేదు. మా పిల్లలు తిరిగి ప్రాణాలతో బయటకు వస్తారు.” అంటూ తల్లి పద్మజ పోలీసులకు చెప్పుకొచ్చింది. అంతేకాదు.. మా కూతుళ్లు బ్రతుకుతారు దయచేసి మీరు వెళ్లిపోండి అంటూ పోలీసులను మృతురాళ్ల తల్లి వేడుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శివాలయం కాలనీలో మూఢ నమ్మకాల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ కూతుళ్లనే కడతేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది.

Also read:

Babu Fires On Jagan: ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదు.. ఉద్యోగులపై సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలకు జగన్ బాధ్యుడన్న చంద్రబాబు

Farmers Tractor Rally: రెడ్ ఫోర్ట్ చేరిన రైతులు, పోలీసులపై ట్రాక్టర్ నడిపించడానికి యత్నం, బస్సులపై రాళ్లు