Ex MLC Sunitha: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నాయకురాలు పోతుల సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు మీద నిమ్మగడ్డకు అమితమైన ప్రేమ ఉంటే. చంద్రబాబు భజన చేసుకోవాలని సూచించారు. అంతేతప్ప ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏంటని ప్రశ్నించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన పోతుల సునీత.. రాష్ట్రంలో కరోనాను తుదముట్టించేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంటే.. చంద్రబాబుకు రాజకీయ లబ్ది చేకూర్చేందుకు హడావుడిగా పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం దారుణం అని మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్‌ను ఎలా సరఫరా చేయాలి.. ఎలా ప్రజలకు అందజేయాలి అనే ప్రయత్నాల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉండగా.. ఈసీ మాత్రం ఎన్నికల నిర్వహణకు పూనుకోవడం ఏంటని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నవారు ఇలా చేయడం హేయమైన చర్యగా పోతుల సునీత అభివర్ణించారు. ఈసీ వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలే సరైన సమయంలో, సరైన రీతిలో గుణపాఠం చెబుతారని అన్నారు.
ఇదిలాఉండగా, తాను మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం రావడంపై పోతుల సునీత స్పందించారు. మూడు నెలల క్రితం తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే తిరిగి తనకు ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సీఎం జగన్ అవకాశం కల్పించారని అన్నారు. చీరాలలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొని ఉందన్నారు. అక్కడ తనతో పాటు.. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు ఉన్నారని సునీత చెప్పుకొచ్చారు. అందరికీ తగిన విధంగా న్యాయం చేసేందుకు సీఎం జగన్ తప్పకుండా చర్యలు తీసుకుంటారని సునీత విశ్వాసం వ్యక్తం చేశారు.
Also read:
బాలికల వివాహంపై వయో పరిమితి ఎందుకు ? దీన్ని పెంచాల్సిందే ! మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.
Viral News: ఎంత క్రియేటివిటీ..ఎంత క్రియేటివిటీ.. ఖాకీలే కంగుతిన్నారు.. ఎలుక కన్నాల మాటన