Andhra Pradesh: ఓ ప్రాణాన్ని కాపాడిన పసివాడి సాహసం.. శభాష్ బిడ్డా అంటూ ప్రశంసల వర్షం

| Edited By: Surya Kala

Dec 19, 2023 | 12:37 PM

కైకరంలో ఓ పక్క షష్టి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే సాయంత్రం 6 గంటల సమయంలో కైకరం గ్రామానికి చెందిన చిన్నమ్ములు అనే మహిళ ఏలూరు కాలవలో పడిపోవడం అక్కడే ఉన్న బాలుడు యశ్వంత్ చూశాడు. ఏమాత్రం లేటు చేయకుండా కాలువలోకి దూకి ఆమెను పట్టుకొని ఒడ్డుకు చేర్చాడు. వెంటనే ఆక్కడ ఉన్న స్థానికులు హుటా హుటిన ఒడ్డు కొచ్చిన చిన్నమ్ములను బయటకు లాగారు.

Andhra Pradesh: ఓ ప్రాణాన్ని కాపాడిన పసివాడి సాహసం.. శభాష్ బిడ్డా అంటూ ప్రశంసల వర్షం
Brave Boy In Eluru
Follow us on

చాలా సమయాలలో మన కళ్ళముందే ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. అటువంటి ప్రమాదాలలో బాధితులకు సాటివారు సహాయం చేయకుండా వాటిని చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. కానీ ఆ బాలుడు మాత్రం అలా చేయలేదు. చిన్న వయసు అయిన పెద్ద మనసుతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడాలని తన ప్రాణాల సైతం లెక్కచేయకుండా సాహసాన్ని చేశాడు. ఇప్పుడు ఆ బాలుడు చేసిన గొప్ప సాహసం ఇప్పుడు జిల్లాలో పలువురు ఉన్నతాధికారులు శభాష్ అని మెచ్చుకునేలా చేసింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు చేసిన సాహసానికి అక్కడున్న స్థానిక ప్రజలతో పాటు అధికారుల సైతం ఆ బాలుడికి హాట్సాఫ్ చెప్పారు. ఆ బాలుడు చూపించిన ధైర్య సాహసాన్ని పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. తన ప్రాణాల సైతం లెక్కచేయకుండా చిన్న వయసులోనే ఓ ప్రాణం కాపాడాలని ఆ బాలుడు చూపించిన ఎంతో స్ఫూర్తిదాయకం.. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కైకరంలో ఓ పక్క షష్టి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే సాయంత్రం 6 గంటల సమయంలో కైకరం గ్రామానికి చెందిన చిన్నమ్ములు అనే మహిళ ఏలూరు కాలవలో పడిపోవడం అక్కడే ఉన్న బాలుడు యశ్వంత్ చూశాడు. ఏమాత్రం లేటు చేయకుండా కాలువలోకి దూకి ఆమెను పట్టుకొని ఒడ్డుకు చేర్చాడు. వెంటనే ఆక్కడ ఉన్న స్థానికులు హుటా హుటిన ఒడ్డు కొచ్చిన చిన్నమ్ములను బయటకు లాగారు. కాలువలో పడిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను రక్షించడంతో ప్రాణాలు నిలిచాయి. అయితే చిన్నమ్ములు ప్రమాదవశాత్తు కాలువలో పడిందా లేక కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందా అనే విషయం మాత్రం సస్పెన్స్ గా మిగిలిపోయింది.. ఏదైతేనేం ప్రమాదంలో ఉన్న మహిళను రక్షించడం కోసం యశ్వంత్ చూపిన ధైర్య సాహసాలు ఎంతో గొప్పవి.

యశ్వంత్ స్థానిక కైకరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. యశ్వంత్ కు ఈతలో కూడా ప్రావీణ్యం ఉండడంతో కాలువలో కొట్టుకుపోతున్న మహిళను రక్షించి ప్రాణాలు కాపాడాడు. ఎవరికి ఏమైతే నాకెందుకులే అని ఆలోచించకుండా గొప్ప మనసుతో ప్రమాదంలో ఉన్న వారిని తన ప్రాణాలు అడ్డుపెట్టి మరి రక్షించాలని బాలుడికి వచ్చిన ఆలోచనకు ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. స్థానిక ప్రజలతో పాటు, అధికారులు సైతం యశ్వంత్ ధైర్యసహసాలను కొనియాడుతున్నారు. ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచాడంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..