Elephant attack in chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం.. వ్యక్తికి గాయాలు..

|

Jan 08, 2021 | 8:04 AM

చిత్తరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.. జిల్లాలోని బంగారుపాలెం మండలం బండ్ల దొడ్డి అటవీ ప్రాంతంలో ఏనుగులు ఓ వ్యక్తి పై దాడి చేసాయి. పశువుల మేతకు వెళ్లిన పెద్దబ్బ..

Elephant attack in chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం.. వ్యక్తికి గాయాలు..
Follow us on

Elephant attack in chittoor : చిత్తూరు  జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.. జిల్లాలోని బంగారుపాలెం మండలం బండ్ల దొడ్డి అటవీ ప్రాంతంలో ఏనుగులు ఓ వ్యక్తి పై దాడి చేశాయి. పశువుల మేతకు వెళ్లిన పెద్దబ్బ ఆచారి అనే పశువుల కాపరి పై ఏనుగుల దాడి చేశాయి. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో పశువుల కాపరి కుప్పయ్య తప్పించుకున్నాడు. పశువులను మేతకు తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా రామిరెడ్డి గుట్ట వద్ద ఓ ఏనుగు తొండంతో విసిరికొట్టడంతో ఆచారికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఏనుగులు ఇలా దాడి చేయడం మొదటిసారి కాదని, ఏనుగుల నుంచి తమను రక్షించాలని గ్రామస్తులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

US violence: డొనాల్డ్ ట్రంప్‌పై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉక్కుపాదం.. నిషేధం మరో రెండు వారాల పొడిగింపు

Today Petrol, Diesel Price: మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజీల్‌ ధరలు… ఎంత పెరిగాయంటే..