Kondapalli Municipal Election: నిన్నటిలాగే సేమ్‌ టు సేమ్‌.. కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా..

కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. సేమ్‌ టు సేమ్‌ నిన్నటిలాగే ఎన్నిక ప్రారంభించే ముందు టెన్షన్‌ చోటుచేసుకుంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో..

Kondapalli Municipal Election: నిన్నటిలాగే సేమ్‌ టు సేమ్‌.. కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా..
Kondapalli Municipal Chairm

Updated on: Nov 23, 2021 | 1:10 PM

కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. సేమ్‌ టు సేమ్‌ నిన్నటిలాగే ఎన్నిక ప్రారంభించే ముందు టెన్షన్‌ చోటుచేసుకుంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆర్వో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌తో పాటు వైసీపీ కౌన్సిలర్లు ఆఫీస్‌ నుంచి వెళ్లిపోయారు.

ఇటు టీడీపీ సభ్యులు మాత్రం ఆఫీస్‌లోనే కూర్చున్నారు. ఎన్నిక జరిగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో టీడీపీ నేతలు హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఉదయం నుంచి కొండపల్లి ఆఫీస్‌లో ఉద్రిక్తత కొనసాగింది. ఎన్నిక ప్రారంభించడానికి ఆర్వో ప్రయత్నించగానే వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని అడ్డుకున్నారు. టేబుల్‌పై క్లాత్‌ చింపివేశారు.

అంతకు ముందు.. ఇరుపార్టీల కార్యకర్తల పోటాపోటీకి ఆందోళనకు దిగారు. 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ భూలక్ష్మి పేరిట లెటర్‌తో కలకలం రేగింది. ఇటు వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కార్యలయం ఆవరణలో వైసీపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ క్యాంప్‌ రాజకీయాలకు తెరలేపాయి. తమ అభ్యర్థులను కాపాడుకునే పనిలో పడ్డాయి. గొల్లపూడి కేంద్రంగా టీడీపీ..ఐతవరంలో వైసీపీ అభ్యర్థులకు క్యాంప్‌లు ఏర్పాటుచేశాయి.

ఇవి కూడా చదవండి: YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణలో సంచలన నిజాలు.. సొంత అల్లుడిపైనే అనుమానాలు..

Winter Makeup Tips: కాలం మారింది.. మేకప్ కిట్‌లో ఈ నాలుగు మార్పులు చేసుకోండి..