Scam: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌పై ఈడీ ఫోకస్‌.. మొత్తం 26 మందికి నోటీసులు..

పూణెకి చెందిన పలు సెల్ కంపెనీలను క్రియేట్ చేసి వాటి ద్వారా నిధులు మళ్లింపు జరిగినట్టు ఈడీ తేల్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావుతో పాటు మాజీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణకు

Scam: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌పై ఈడీ ఫోకస్‌.. మొత్తం 26 మందికి నోటీసులు..
AP Skill development corporation scam

Updated on: Dec 04, 2022 | 12:38 PM

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌పై ఈడీ దూకుడు పెంచిది. తాజాగా 26 మందికి నోటీసులు జారీ చేశారు. ఇందులో మొత్తం 234 కోట్ల నిధుల మళ్లింపు పై ఈడీ కేసు నమోదు చేసింది. పూణెకి చెందిన పలు సెల్ కంపెనీలను క్రియేట్ చేసి వాటి ద్వారా నిధులు మళ్లింపు జరిగినట్టు ఈడీ తేల్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావుతో పాటు మాజీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణకు నోటీసులు ఇచ్చింది ఈడీ. వీరితోపాటు ఓఎస్‌డీ నిమ్మగడ్డ కృష్ణ ప్రసాదర్‌కు నోటీసులు జారీ చేసింది. హైదరాబాదులోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

అసలు ఏం జరిగిందంటే..

2014 నాటి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో విచారణ వేగవంతం చేసింది. అప్పటి ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో సీఐడీ విచారణ చేపట్టిన ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో సిఎ విపిన్‌కుమార్ శర్మ, అతని భార్య నీలం శర్మలను ఢిల్లీ లో అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో 234 కోట్లు స్కామ్ జరిగినట్లు దర్యాప్తులో తేల్చారు. మరోవైపు అక్రమ తప్పులపై అప్పట్లో నిజం ఒప్పుకున్నారు పూణేకు చెందిన కంపెనీ ప్రతినిధులు.

2017లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ యూనిట్, పూణే, డిజైన్‌టెక్‌పై వివిధ షెల్ కంపెనీల ద్వారా నకిలీ బిల్లులను సమర్పించినందుకు కేసు నమోదు చేయడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఇన్‌వాయిస్‌లను పెంచడం ద్వారా ఆ మొత్తాన్ని ఇతర అనుబంధ షెల్ కంపెనీలకు మళ్లించారు. SIEMENS నిర్వహించిన అంతర్గత విచారణలో కూడా, ఏపీఎస్ఎస్‌డీసీ నుంచి నిధులను డిజైన్‌టెక్ ద్వారా ఒక పీవీఎస్‌పీ ఐటీ స్కిల్స్‌కు సబ్‌కాంట్రాక్ట్ ఇచ్చి, ఆపై ఇతర కంపెనీలకు ఎటువంటి సేవలను అందించకుండా, వస్తువులను సరఫరా చేయకుండా మళ్లించినట్లు నిర్ధారించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అప్పట్లోనే 26 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు సీఐడీ అధికారులు. మాజీ స్పెషల్ సెక్రటరీ గంటా సుబ్బారావు, మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ, ఓఎస్టీ నిమ్మగడ్డ వెంకట కృష్ణపైనా కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. పుణేకు చెందిన డిజైన్ టెక్ సిస్టం, పాత్రిక్ సర్వీస్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్, వెబ్ సర్వీస్లపైనా కేసులు నమోదు చేశారు. ఢిల్లీ, పుణేలకు చెందిన కంపెనీ డైరెక్టర్లపైనా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం షెల్‌ కంపెనీలకు నిధుల మళ్లింపు వ్యవహారం బయటకు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. అప్పట్లో నిందితులుగా ఉన్న 26 మందికి తాజాగా నోటీసులు జారీ చేసింది.

స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ గుర్తించింది. ఫోరెన్సిక్ ఆడిట్ ఆధారంగా కేసు నమోదైంది. కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. నిరుద్యోగులకు శిక్షణ పేరుతో నిధులు మళ్లించినట్లుగా పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీలతో కలిసి నిధులు మళ్లించినట్లు గుర్తించారు. అప్పట్లో మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు పూర్తి చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌కు 234 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్ ఇచ్చినట్లు డిజైన్ టెక్. పుణే జీఎస్టీ సోదాల్లో సాఫ్ట్‌వేర్ మోసం వెలుగు చూసింది. స్కిల్ డెవలప్మెంట్‌కు ఎలాంటి సాఫ్ట్వేర్ ఇవ్వలేదని నిర్ధారించారు. కేవలం 4 కంపెనీలు ఏర్పాటు చేసి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం