AP News: ఏపీలో ఆ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడతాయా..? ఇదిగో క్లారిటీ

|

May 07, 2024 | 7:17 AM

AP స్కీమ్స్‌కు గ్రహణం పట్టింది. పేదల పథకాలపై కత్తి వేలాడుతోంది. ఎన్నికల రాజకీయం అభాగ్యులకు శాపంగా మారుతోంది. TDP కుట్రలతోనే ఈ పరిస్థితి వచ్చిందని CM సహా YCP నేతలంతా భగ్గుమంటున్నారు. ఆ డీటేల్స్ ఏంటో తెలుసకుందాం పదండి...

AP News: ఏపీలో ఆ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడతాయా..? ఇదిగో క్లారిటీ
Jagan Mohan Reddy
Follow us on

ఊరంతా ఒకదారైతే.. ఉలిపికట్టెది మరో దారి అన్నట్టుగా తయారైంది ఏపీ పరిస్థితి. తెలంగాణలో పథకాలు యథాతథంగా కంటిన్యూ అవుతుండగా.. ఏపీలో మాత్రం రాజకీయం రాజుకుంటోంది. సాఫీగా సాగుతున్న పథకాలకు సడెన్‌ బ్రేక్‌ పడుతోంది. ఏపీలో పెన్షన్‌ ఇంకా టెన్షన్‌ పెడుతూనే ఉంది. ఈ రాద్ధాంతం ముగియక ముందే పేదలపై మరో పిడుగు పడింది. పథకాల చివరి దశ చెల్లింపులకు రెడ్‌ సిగ్నల్‌ వేసింది ఈసీ. ఈ పరిణామంతో కోడ్‌ ముగిసేదాకా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. రైతు భరోసా సాయాన్ని రిలీజ్‌ చేస్తోంది అక్కడి ప్రభుత్వం. తెలంగాణ పథకాలకు అనుమతి ఇస్తోన్న ఈసీకి ఏపీ విషయంలో వచ్చిన ఇబ్బందేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇదే విషయమై నిప్పులు చెరిగారు సీఎం జగన్‌. పథకాలపై ప్రతిపక్షం పగబట్టిందని ఆరోపించారు. పథకాలను బాబు ఆపుతున్నాడంటూ ఫైర్‌ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్‌ ద్వారా పథకాల్ని ఆపాడని విమర్శించారు సీఎం. పేదల్ని వేధించడం చంద్రబాబుకు సరదా అని విమర్శించారు సజ్జల. రాష్ట్రానికి చీడలా తయారయ్యారంటూ ఫైరయ్యారు. ఏపీలో ఈసీ బ్రేకులేసిన పథకాలు ఎప్పటి నుంచో అమలవుతున్నాయ్‌. ఆన్‌గోయింగ్‌ పథకాలపై ఆంక్షలు రాజకీయ రచ్చ రాజేస్తున్నాయి. మే నెలలో విడుదల చేయాల్సిన సంక్షేమ పథకాల్లో ఫీజు రీఎంబర్స్‌మెంట్ (విద్యాదీవెన), ఇన్ పుట్ సబ్సిడీ (రైతు భరోసా) లాంటి పథకాలు ఉన్నాయి. కాగా గత నెల నుంచే ఆసరా పింఛన్లను వాలంటీర్లు నేరుగా ఇంటికి వెళ్లి అందించే ప్రక్రియను ఈసీ ఆపేసిన విషయం తెలిసిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..