AP Politics: ఏపీలో టీడీపీ-జనసేన పొత్తుపై కొత్త అనుమానాలు

|

Jun 19, 2023 | 2:28 PM

TDP-Janasena: ఏడాది ముందుగానే ఏపీలో పొలిటికల్ జోష్ పెరిగింది. ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై, ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు అధినేతలు సైతం 175కు 175 స్థానాలు గెలవాలంటూ కేడర్‌కు సూచిస్తున్నారు. ఆ డీటేల్స్ చూద్దాం పదండి.

AP Politics: ఏపీలో టీడీపీ-జనసేన పొత్తుపై కొత్త అనుమానాలు
Chandrababu - Pawan Kalyan
Follow us on

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో ట్రయాంగిల్ వార్ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో అన్ని పార్టీల టాస్క్‌.. టార్గెట్ 175గా ఉంది. 175కి 175 సీట్లు గెలవాలని కేడర్‌కి టార్గెట్ పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎంగా ఒక్క ఛాన్స్ అంటూ అభ్యర్థిస్తున్నారు పవన్ కల్యాణ్. వై నాట్ 175 అంటూ ఇప్పటికే జనంలోకి దూసకెళ్తుంది వైసీపీ. ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చెయ్యడం పార్టీల ఇష్టం. కానీ.. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదురుందని ప్రచారం జరిగిన సమయంలో ఇప్పుడు పవన్ కల్యాణ్ సీఎం సీటని, చంద్రబాబు టార్గెట్ 175 అని మాట్లాడడమే కొత్త సందేహాలకు తావిస్తోంది.

దీంతో ఏపీలో టీడీపీ-జనసేన పొత్తుపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  కత్తిపూడి సభలో ఎమ్మెల్యేగా గెలిపించండి అన్న పవన్ కల్యాణ్..  ఆ మర్నాడే సీఎంని చెయ్యండి అంటూ చేబ్రోలులో ప్రసగించారు. ఇప్పుడు చంద్రబాబు నోట కూడా 175 మనమే గెలవాలంటూ మాటలు వచ్చాయి.  టీడీపీకి-జనసేనకు చెడింది అంటున్న వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అన్న వ్యాఖ్యలకు బాబు, పవన్ కామెంట్స్ ఊతమిస్తున్నాయి.

ఇక పవన్ కల్యాణ్ సీఎం సీటు అంటూ ఒక్క చాన్స్ అడుగుతున్నారు. రాష్ట్రానికి సీఎం కావాలంటే మెజార్టీ సీట్లలో పవన్ పోటీ చేసి గెలిస్తేనే సాధ్యం. పొత్తుల్లో ఉంటే అది సాధ్యం కాకపోవచ్చు. అంటే పవన్ టీడీపీ లేకుండానే బరిలో దిగబోతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇంతకీ పవన్‌కి-చంద్రబాబుకు చెడిందా. అందుకే చంద్రబాబు 175 సీట్లు అని, పవన్ సీఎం సీటని అంటున్నారా..? ఇదే విషయంపై కాసేపటి క్రితం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌ మాట మార్చారని, ఇద్దరికీ చెడిందంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..