ఏపీలో ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణి ప్రారంభమై ఐదు రోజులైనా కాకముందే చేతులెత్తేసిన వాహనాల డ్రైవర్లు

|

Feb 06, 2021 | 5:00 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణి ప్రారంభమై ఐదు రోజులైనా కాకముందే చేతులెత్తేశారు వాహనాల డ్రైవర్లు.. డీలర్లు, వాలంటీర్ల...

ఏపీలో ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణి ప్రారంభమై ఐదు రోజులైనా కాకముందే చేతులెత్తేసిన వాహనాల డ్రైవర్లు
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణి ప్రారంభమై ఐదు రోజులైనా కాకముందే చేతులెత్తేశారు వాహనాల డ్రైవర్లు.. డీలర్లు, వాలంటీర్ల నుంచి తమకు తగిన సహకారం అందడం లేదన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో వాహనాల డ్రైవర్లు ఆందోళనకు దిగారు.

ఇలాఉండగా, రేషన్ పంపిణీ వాహనాలపై అధికార పార్టీకి చెందిన రంగులను తొలగించాల్సిందేనని ఆదేశించింది ఎన్నికల కమిషన్‌. రంగులు మార్చకపోతే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తిప్పడానికి అనుమతి లేదని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రంగు మార్చిన వాహనాలు తమకు చూపిన తర్వాతే తిప్పాలని స్పష్టం చేసింది.

కాగా, ఎస్ఈసీ ఆదేశాలతో మేనిఫెస్టో ఉపసంహరించామన్నారు టీడీపీ నేతలు. ఏ చట్టం ప్రకారం దీన్ని రద్దు చేశారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు ఆ పార్టీ నేత వర్ల రామయ్య.. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డను కలిసిన టీడీపీ బృందం పంచాయితీ ఎన్నికలు సజావుగా జరగడం లేదని ఫిర్యాదు చేసింది.

పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు విజ్ఞప్తి చేసింది వైసీపీ. మీడియాలో వచ్చాక మానిఫెస్టోను రద్దు చేశామని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఈసీ చర్యలు రాజ్యాంగ విరుద్దంగా ఉన్నాయన్నారు వైసీపీ నేతలేళ్ల అప్పిరెడ్డి.

18నెలల తర్వాత ఉపశమనం, జమ్ముకశ్మీర్‌లో అందుబాటులోకి 4జీ ఇంటర్నెట్ సేవలు