Pawan kalyan: అదిరిపోయే ఫొటో.. కూతురు ఆద్యతో పవన్ కల్యాణ్ సెల్ఫీ.. నెట్టింట వైరల్..

|

Aug 15, 2024 | 2:43 PM

ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పేర్కొన్నారు. శేషాచలం అడవుల్లో కొట్టేసిన 140 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను తరలిస్తుంటే కర్నాటకలో పట్టుకున్నారని పవన్ తెలిపారు.

Pawan kalyan: అదిరిపోయే ఫొటో.. కూతురు ఆద్యతో పవన్ కల్యాణ్ సెల్ఫీ.. నెట్టింట వైరల్..
Pawan Kalyan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పేర్కొన్నారు. శేషాచలం అడవుల్లో కొట్టేసిన 140 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను తరలిస్తుంటే కర్నాటకలో పట్టుకున్నారని పవన్ తెలిపారు. ఎర్రచందనం దుంగలను వేలం వేయడంతో వచ్చిన ఆ డబ్బు కర్నాటక ప్రభుత్వానికి వెళ్లిందన్నారు. కాకినాడ పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు.. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

కూతురు ఆద్యాతో పవన్ కల్యాణ్ ఫొటో..

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.. పవన్ కల్యాణ్ కూతురు ఆద్యతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు.. ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది..

పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కేడర్ ఆ ఫోటోని చూసి తెగ మురిసిపోతున్నారు. ఈ ఫొటోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు..

పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..