నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పచ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు 30 నవంబర్ 2024 భారత కాలమానం ప్రకారం ఉదయం 08.గం.30 ని .లకు ,ఉత్తర అక్షాంశం 12 .3 ° తూర్పు రేఖాంశం 80.9 °వద్ద అదే ప్రాంతము లో కేంద్రీకృతమై ఉంది. ఇది ట్రింకోమలీ(శ్రీ లంక )కి ఉత్తర ఈశాన్యముగా 420 కి.మీ, నాగపట్టణానికి ఉత్తర వాయవ్య దిశగా200 కి.మీ., పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యముగా 120 కి.మీ. చెన్నైకి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పశ్చిమ దిశగా కదిలి, ,నవంబర్ 30 వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి దగ్గర , కారైకాల్, మహాబలిపురం తీరాల మధ్య, పుదుచ్చేరికి సమీపంలో , గంటకు 70-80 కి.మీ., గరిష్టం గా 90 కి .మీ ఈదురుగాలుల వేగం తో ఈ తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది.
ఈరోజు:-
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశము ఉంది
భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.
రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఇది చదవండి: ఉన్నట్టుండి స్టేషన్‌లో ఖైదీ మిస్సింగ్.. ఊరంతా గాలించారు.. సీన్ కట్ చేస్తే
ఈరోజు:-
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశము చాలా ఉంది.
భారీ నుండి అతి భారీ వర్షాల తో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఈదురు గాలులు,గంటకు-50 -60 కి మీ వేగం,గరిష్టం గా 70 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది
రేపు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఈదురు గాలులు,గంటకు-40 -50 కి మీ వేగం,గరిష్టం గా 60 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఇది చదవండి: నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..