AP Rains: దడపుట్టిస్తోన్న తుఫాన్.. బాబోయ్.! ఏపీలో ఉరుములతో అతి భారీ వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

|

Nov 27, 2024 | 1:34 PM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు 27 నవంబర్ 2024 భారత కాలమానం ప్రకారం ఉదయం 08.గం.30 ని .లకు,ఉత్తర అక్షాంశం 8.5°, తూర్పు రేఖాంశం 82.3°వద్ద కేంద్రీకృతమై ఉంది.

AP Rains: దడపుట్టిస్తోన్న తుఫాన్.. బాబోయ్.! ఏపీలో ఉరుములతో అతి భారీ వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
Ap Rains
Follow us on

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు 27 నవంబర్ 2024 భారత కాలమానం ప్రకారం ఉదయం 08.గం.30 ని .లకు ,ఉత్తర అక్షాంశం 8.5°, తూర్పు రేఖాంశం 82.3°వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది ట్రింకోమలీ(శ్రీ లంక )కి తూర్పు ఆగ్నేయంగా 120 కి.మీ, నాగపట్టణానికి ఆగ్నేయంగా 370 కి.మీ., పుదుచ్చేరికి ఆగ్నేయంగా 470 కి.మీ, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదిలే అవకాశాలు మరింత ఎక్కువగా వున్నాయి. రాగల 12 గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు రోజులలో ఈ తుఫాను,శ్రీలంక తీరం చుట్టూ కదులుతూ, ఉత్తర వాయవ్య దిశగా తమిళనాడు తీరం వైపు ప్రయాణిస్తుంది.

————————————–
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :
—————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
—————————————-

ఈరోజు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.

భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
——————————

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురు గాలులు,గంటకు-44 -55 కి మీ వేగం,గరిష్టం గా 65 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
బలమైన ఈదురు గాలులు ,గంటకు-55 – 65 కి మీ వేగం,గరిష్టం గా 75 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది

ఎల్లుండి :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:-

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురు గాలులు (గంటకు-44 -55 కి మీ వేగం,గరిష్టం గా 65 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
బలమైన ఈదురు గాలులు, గంటకు-55 – 65 కి మీ వేగం,గరిష్టం గా 75 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశముంది.
భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
బలమైన ఈదురు గాలులు ,గంటకు-55 – 65 కి మీ వేగం,గరిష్టం గా 75 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..