Cyclone Effect on AP : ఉత్తర కోస్తాంధ్రకు తుపాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు.. అధికారుల వార్నింగ్..

|

Sep 25, 2021 | 11:05 AM

AP Weather Alert: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందిన అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం..

Cyclone Effect on AP : ఉత్తర కోస్తాంధ్రకు తుపాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు.. అధికారుల వార్నింగ్..
Cyclone
Follow us on

AP Weather Alert: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందిన అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం పూరీకి 590 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, కళింగపట్నానికి 740 కి.మీ. తూర్పుగా కేంద్రీకృతమై ఉందన్నారు. ఆదివారం నాటికి అది తుపాను మారనుందని తెలిపారు. ఈ తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ తుపాను సోమవారం నాటికి దక్షిణ ఒడిసాలోని గోపాల్‌పూర్, ఉత్తరకోస్తాంధ్రాలోని విశాఖపట్నం మధ్య.. కళింగపట్నానికి సమీపాన తీరం దాటుతుందని అధికారులు చెప్పారు. తుపాను తీరం దాటే సమయంలో కోస్తా తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు.

తుపాను నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఈ వాయుగుండం ప్రభావంతో.. ఇవాళ కోస్తాంధ్రా పరిధిలోని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తుపాను తీరం దాటే సమయంలోనూ భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచించారు. ఇక వాయుగుండం ప్రభావంతో విశాఖ జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశారు అధికారులు. ఎవరికైనా ఇబ్బంది తలెత్తితే.. వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు 1800 4250 0002, 0891 2590100, 089 2590102 లను సంప్రదించాలని సూచించారు.

Also read:

Amit Shah Cooperative Conference Live: హస్తినలో మొట్ట మొట్టమొదటి జాతీయ సహకార సదస్సు.. లైవ్ అప్డేట్స్

ఆ పేరు చెబితే క్రిమినల్స్ గజగజ వణికిపోతున్నారు.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యలు

SP Balu: మీ అమృత గానానికి మరణం లేదు.. వర్థంతినాడు ఎస్పీ బాలును స్మరించుకుంటున్న నెటిజన్స్